హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: ఆధార్‌లో వివరాలు మార్చి బాల్యవివాహం.. కానీ చివరికి

Warangal: ఆధార్‌లో వివరాలు మార్చి బాల్యవివాహం.. కానీ చివరికి

ఆధార్ లో మోసం

ఆధార్ లో మోసం

Telangana: బాలిక వయస్సు 14 సంవత్సరాలు.. కానీ పెళ్లి చేయాలంటే మేజర్ కావాలి 18సంవత్సరాలు నిండాలి. దీంతో ఆ బాలిక తండ్రి ఓ పథకం చేశాడు. మీసేవా కేంద్రం నిర్వాహకుడి సహకారంతో ఏకంగా నాలుగేళ్ల వయస్సును పెంచి ఆధార్ కార్డు క్రియేట్‌ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Santhosh, News 18, Warangal

బాలిక వయస్సు 14 సంవత్సరాలు.. కానీ పెళ్లి చేయాలంటే మేజర్ కావాలి 18సంవత్సరాలు నిండాలి. దీంతో ఆ బాలిక తండ్రి ఓ పథకం చేశాడు. మీసేవా కేంద్రం నిర్వాహకుడి సహకారంతో ఏకంగా నాలుగేళ్ల వయస్సును పెంచి ఆధార్ కార్డు క్రియేట్‌ చేశారు. ఇంకేముంది అంతా ఓకే అనుకుని ఓ వరుడిని చూసి వివాహానికి ఏర్పాట్లు కూడా చేశారు. మరో గంటలో పెళ్లి అనగా వచ్చిన అధికారులు వివాహ తంతును అడ్డుకున్నారు. బయ్యారం మండల కేంద్రంలోని ముత్యాలమ్మ బజార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బయ్యారం మండలం వినోబానగర్‌కు చెందిన వ్యక్తి తన భార్య చనిపోవడంతో కుమార్తెతో కలిసి సంవత్సరం క్రితం నుంచి బయ్యారంలో నివాసం ఉంటూ గొర్లకాపరిగా జీతం ఉంటున్నాడు.

ఈక్రమంలో తన కుమార్తె గత సంవత్సరం నుంచి పాఠశాలకు వెళ్లడంలేదు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటోంది.ఈ క్రమంలోనే బాలికకు వివాహం చేయాలని తండ్రి తలచి శ్రీ రామగిరికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్ఛయించారు. ఐతే బియ్యారంలో తన నివాసంలో వివాహం చేయడానికి ప్రయత్నించారు ఈ క్రమంలోనే మరో గంటలో వివాహం అవుతుందనే సమయంలో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా తెలుసుకున్న తహసీల్దార్‌ రమేష్‌, జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్‌ రమేష్‌, పోలీసులు, చైల్డ్‌లైన్‌ సభ్యురాలు ఉమారాణి పెళ్లి ఇంటికి చేరుకుని బాల్య వివాహన్ని అడ్డుకున్నారు.

బాలికను మహబూబాబాద్‌లోని ఛైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరుపరిచి, సంరక్షణలో ఉంచారు. తహసీల్దార్‌ రమేష్‌ ఆధార్‌కార్డును పరిశీలించి డూప్లికేట్‌ కార్డుగా గుర్తించారు. తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు ఆధార్‌ సెంటర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలు నాశనం చేయవద్దని తల్లితండ్రులను కోరారు. బాల్యవివాహం చేయడం చట్ట వ్యతిరేకమని తెలిసి కూడా ఇలాంటి పనులకు పాల్పడే వారిపై చట్ట పరమైన చర్యలు చేపడతామని అధికారులు హెచ్చరించారు.

First published:

Tags: Local News, Telanangana, Warangal

ఉత్తమ కథలు