కేంద్ర సర్వీసుల్లోకి ఆమ్రపాలి... కిషన్ రెడ్డి కోసం...

Amrapali IAS | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఓఎస్డీగా ఆమ్రపాలి కాటా, అడిషనల్‌ పీఎస్‌గా కె.శశికిరణాచారి వెళ్లనున్నారు. ఈమేరకు వారిని కేంద్ర సర్వీసులోకి పంపించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి సమాచారం అందింది.

news18-telugu
Updated: July 12, 2019, 11:38 AM IST
కేంద్ర సర్వీసుల్లోకి ఆమ్రపాలి... కిషన్ రెడ్డి కోసం...
ఆమ్రపాలి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 12, 2019, 11:38 AM IST
జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులు కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఓఎస్డీగా ఆమ్రపాలి కాటా, అడిషనల్‌ పీఎస్‌గా కె.శశికిరణాచారి వెళ్లనున్నారు. ఈమేరకు వారిని కేంద్ర సర్వీసులోకి పంపించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి సమాచారం అందింది. గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి బదిలీపై జీహెచ్‌ఎంసీకి వచ్చి అడిషనల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రజల మెప్పు పొందిన ఆమ్రపాలి... పరిపాలనాపరంగా అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే తన బ్యాచ్‌మేట్ అయిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను ఆమ్రపాలి ప్రేమ వివాహం చేసుకున్నారు.


First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...