హోమ్ /వార్తలు /తెలంగాణ /

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు!..

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు!..

X
డబుల్

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నీచపు పనులు

Telangana: తెలంగాణ ప్రభుత్వం పేదవాడి కలలు సహకారం చేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమం డబుల్ బెడ్ రూమ్. అయితే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎలా ఉన్నా.. నిర్వాహణలో లోపంతో పేదలకు పంచాల్సిన ఇండ్లు నిరుపయోగంగా మారుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ ప్రభుత్వం పేదవాడి కలలు సహకారం చేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమం డబుల్ బెడ్ రూమ్. అయితే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎలా ఉన్నా.. నిర్వాహణలో లోపంతో పేదలకు పంచాల్సిన ఇండ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాస్త అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డబల్ బెడ్ రూమ్ ఇండ్లపై న్యూస్ 18 స్పెషల్ స్టోరీ.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్స్ పంపిణీ జరిగితే జనంతో కళకళలాడేది. కానీ, ఇప్పుడు ఆ ప్రాంతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60 వేల మంది లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కోసం దరఖాస్తు చేసుకోగా 30 వేల మందికి మాత్రమే మంజూరు చేశారు. హనుమకొండ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సముదాయం పేదలకు ఇచ్చేందుకు కొన్ని సంవత్సరాల క్రితమే నిర్మాణం చేపట్టారు. ఈ సముదాయంలో కొన్ని వందల ఇండ్లు ఉన్నాయి.

ఇవి పేదలకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆ ప్రాంతంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఈ ఇండ్లలో ఎక్కడ చూసినా మద్యం బాటిల్లు కనిపిస్తున్నాయి. ఈ ఇండ్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంపై లబ్ధిదారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పూర్తయిన ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గడుస్తున్న ఎనిమిది సంవత్సరాల కాలంలో 7,000 ఇండ్లు పూర్తి చేయగా.. లబ్ధిదారులకు మాత్రం నాలుగు వేల ఇండ్లు మాత్రమే పంపిణీ చేశారు. మిగతా మూడు వేల ఇండ్లలో ఇదే పరిస్థితి. వరంగల్, హనుమకొండ నగరానికి సంబంధించి ఒక్క లబ్ధిదారుడికి కూడా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదు.

వరంగల్, హనుమకొండ నగరంలో సుమారు 2 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేసి నిరుపయోగంగా పడి ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకొని నిరుపయోగంగా పడి ఉన్న ఇండ్లను లబ్ధిదారులకు అందజేసి గృహప్రవేశం చేయించినట్లయితే లబ్ది దారులకు మేలు జరగడమే కాకుండా.. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉంటాయని సామాజిక కార్యకర్త తిరునాహరి హరి శేషు అంటున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు