హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : పసిబిడ్డ తల్లి ప్రాణాలతో చెలగాటం.. కడుపులో కాటన్‌ పెట్టి సర్జరీ చేసిన డాక్టర్లు

Telangana : పసిబిడ్డ తల్లి ప్రాణాలతో చెలగాటం.. కడుపులో కాటన్‌ పెట్టి సర్జరీ చేసిన డాక్టర్లు

(Cotton in stomach)

(Cotton in stomach)

Viral News: ప్రాణం పోయాల్సిన డాక్టర్లు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ప్రసూతి మహిళకు సర్జరీ చేసిన డాక్టర్స్ కడుపులో ఏం పెట్టి మర్చిపోయారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

వెనకటికి ఎవరో చెప్పినట్లుగా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేస్తున్న తీరు చూస్తుంటే వైద్యో నారాయణో హరి అనే నానుడి నిజమే అనిపిస్తుంది. వరంగల్(Warangal)జిల్లాలోని వర్ధన్నపేట(Vardhannapet)ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల(Doctors) నిర్వాకమే అందుకు నిదర్శనంగా చెప్పాలి. గర్భిణి(Pregnant woman)కి ఆపరేషన్ చేయమంటే కడుపులో దూది(Cotton) పెట్టి కుట్లేసిన సంఘటన ఆలస్యంగా బయటపడింది. ఇదేంటని బాధితురాలి భర్త నిలదీస్తే తప్పైపోయింది క్షమించమంటూ కాళ్లు, వేళ్లు పట్టుకున్నారంట ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు.

Child marriage : తండ్రికి తెలియకుండానే నైన్త్ క్లాస్‌ విద్యార్ధినికి పెళ్లి, శోభనం..చేసిందెవరో తెలిస్తే షాక్ అవుతారుప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం..

పేదలకు ప్రాణం పోయాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు వైద్య సిబ్బంది. గర్భిణులు, పసిపిల్లలు, వృద్ధులు ఎలాంటి అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో అడుగుపెట్టినా..డాక్టర్ల నిర్లక్ష్యం , వైద్య సిబ్బంది తమ లంచాల కక్కూర్తితో పేషెంట్ల ప్రాణాలను బ్రతికుండగానే తోడేస్తున్నారు. వరంగల్ జిల్లా వర్దన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఈనెల 16వ తేదిన వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని బావనికుంట తండాకు చెందిన నునావత్ సౌజన్య అనే గర్బిణి పురిటి నొప్పులతో బాధ పడుతుంటే 108వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే సౌజన్య నార్మల్ డెలవరీ అయింది. అధికంగా రక్తస్రావం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉన్నారని చెప్పి రక్తస్రావం తగ్గడానికి చిన్న శాస్త్రచికిత్స చేసి కుట్లు వేశారు.

కడుపులో కాటన్ పెట్టారు..

ఇంత వరకు బాగానే జరిగిందని అందరూ అనుకున్నారు. ఆపరేషన్ తర్వాత భార్యను తీసుకొని నునావత్‌ దేవేందర్‌ ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు నుంచి సౌజన్యకు కడుపునొప్పితో పాటు కడుపుకు సంబంధించి మరికొన్ని సమస్యలతో ఇబ్బంది పడింది. వెంటనే ఆమె భర్త వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. డెలవరీ సమయంలో ఆపరేషన్ చేసిన సమయంలో దూది కడుపులో పెట్టి కుట్లు వేసినట్లుగా గుర్తించారు.

Telangana : ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన జిల్లా కలెక్టర్ .. సార్ షడన్‌ ఎంట్రీతో స్టాఫ్ షాక్సారీతో సరిపెట్టిన డాక్టర్లు ...

భార్య కడుపులో కాటన్ పెట్టి కుట్లు వేసినట్లుగా తెలుసుకున్న దేవేందర్‌ తీవ్ర ఆందోళనకుగురయ్యాడు. శుక్రవారం తన భార్య సౌజన్యను తీసుకొని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సర్జరీ చేసిన డాక్టర్లను నిలదీశాడు. విషయాన్ని బాధితుల ద్వారా తెలుసుకున్న డాక్టర్లు పొరపాటు జరిగిన విషయాన్ని అంగీకరించారు. కుట్లు వేసినప్పుడు మర్చిపోయి దూదిని పెట్టి కుట్లు వేశామని తప్పైందని క్షమించాలంటూ కాళ్ల, వేళ్ల పడ్డారు. వెంటనే బాధితురాలుకి మరోసారి శాస్త్రచికిత్స చేసి కాటన్‌ను బయటకు తీశారు. సౌజన్య ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. బాధితురాలి భర్త ద్వారా విషయం బయటకు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రసూతి మహిళలు భయపడిపోతున్నారు.

First published:

Tags: Telangana News, Warangal

ఉత్తమ కథలు