Home /News /telangana /

WARANGAL DAUGHTER WHO KILLED FATHER TO PREVENT LOVE MARRIAGE IN MAHABUBABAD DISTRICT SNR

Mahabubabad: ప్రియుడి కోసం తండ్రిని చంపింది..మైనర్‌ లవ్ అఫైర్‌లో బయటపడ్డ ట్విస్ట్

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

OMG:ప్రియుడి కోసం కన్నతండ్రిని హత్య చేసింది ఓ కూతురు. మహబూబాబాద్ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. ప్రేమపెళ్లికి తండ్రి అంగీకరించడం లేదన్న కోపంతో ప్రియుడి సహాయంతో కర్రతో కొట్టి చంపడమే కాకుండా ఆస్తి వివాదంలో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైంది కూతురు.

ఇంకా చదవండి ...
మానవ సంబంధాలన్ని ఆర్ధిక బంధాలుగా, అవసరాలు తీర్చుకునే తాత్కాలిక పరిచయాలుగా మారుతున్నాయి. ఓ కూతురు తండ్రిని హత్య చేసింది. మహబూబాబాద్‌ జిల్లాలో ఈ దారుణం బయటపడింది. ప్రియుడితో పెళ్లికి అడ్డు చెబుతున్నాడనే కోపంతోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. మహబూబాబాద్(Mahabubabad) మండలం వేమునూరు(Vemunuru)కి చెందిన ప్రభావతి(Prabhavathi) అనే మైనర్ తండ్రి వెంకన్న(Venkanna)ను తాను ప్రేమించిన యువకుడితో కలిసి కొట్టి చంపింది. అయితే ఈకేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. ప్రభావతి కొంత కాలంగా వేమునురుకి చెందిన వెంకటేశ్వర్లు(Venkateshwalu)అనే యువకుడితో ప్రేమలో పడింది. అతడిని ప్రభావతి ప్రేమించడం తండ్రి వెంకన్నకు ఇష్టం లేదు. అంతే కాదు...ఇదే విషయాన్ని కూతురుతో గట్టిగా చెప్పడంతో తండ్రిపై పగ పెంచుకుంది. ప్రేమ వ్యవహారం తండ్రి, కూతురు మధ్య శత్రుత్వానికి కారణమైంది. ఈ క్రమంలోనే తన ప్రియుడు వెంకటేశ్వర్లతో కలిసి ప్రభావతి కర్రతో కొట్టి తండ్రి వెంకన్నను అత్యంత కిరాతకంగా హతమార్చింది. విషయం బయటకు రాకుండా మేనేజ్ చేయాలని కూడా పక్కాగా పథకం వేసింది. తన తండ్రి ఆస్తి కోసం రోజు మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని..ఆ టార్చర్ భరించలేకే చంపినట్లుగా స్థానికులు, పోలీసు(Police)ల ముందు కట్టుకథ అల్లింది. నిందితురాలు చెబుతున్న మాటల్లో ఏదో తేడాగా అనిపించడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. నిందితురాలిని తమదైన శైలీలో విచారించగా షాకింగ్‌ న్యూస్ బయటపడింది.

ప్రియుడే ముద్దు తండ్రి వద్దంది..
నచ్చిన వాడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది నిందితురాలు ప్రభావతి. ఈవిషయం తండ్రికి అసలు ఇష్టం లేకపోవడంతో ఎలాగైనా తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్న తండ్రిని చంపి ప్రియుడితో కలిసి జీవించాలనుకుంది. అందులో భాగంగానే ప్రియుడు వెంకటేష్‌ నిందితురాలు ఇద్దరూ కలిసి కర్రతో కొట్టి వెంకన్నను చంపేశారని పోలీసుల విచారణలో నిందితురాలే అంగీకరించింది. మర్డర్ కేసులో తన ప్రియుడు చిక్కుకోకూడదనే ఆలోచనతో పాటు ప్రేమ పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందనే నేరపూరితమైన ఆలోచనతోనే ఈ దురాగతానికి ఒడిగట్టానని నిందితురాలు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

తన ప్రేమకు నాన్నను బలిచ్చింది..
వెంకన్న డెత్‌ కేసులో మిస్టరీ చేధించిన పోలీసులు హత్యకు పాల్పడిన అతని కూతురుతో పాటు ఆమె ప్రియుడిపై మర్డర్ కేసు నమోదు చేశారు మహబూబాబాద్ పోలీసులు. ఇద్దర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య చేయడానికి ముందే వెంకన్నపై ఆస్తి తగాదా విషయంపై కేసు పెట్టారని..సీఐ రవికుమార్‌ తెలిపారు. అయితే ఓ తండ్రిని ప్రియుడి కోసం కన్నకూతురే హతమార్చిందన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు మాత్రం ఈ మర్డర్ కేసులో కూతురు, ఆమె ప్రియుడు ఇద్దరి పాత్ర ఉందా లేక ఇంకా ఎవరి సహకారమైనా తీసుకున్నారా అనే కోణంలో కూడా కూపీ లాగుతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Crime news, Mahabubabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు