Santhosh, News 18, Warangal.
అత్త ఇంట్లో అల్లుడు దొంగతనానికి పాల్పడిన విచిత్ర ఘటన ఐనవోలు మండలం పున్నెల్ గ్రామంలో చోటుచేసుకుంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మామునూర్ ఏసీపీ నరేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన మల్లయ్య వృత్తిరిత్యా పందుల పెంపకం దారుడు మల్లయ్యకు ఇద్దరు కూతుళ్లు. చిన్నకుమార్తెకు ఆమె భర్తతో విభేదాలు రావడంతో వేరు కాపురం ఉంటుంది. వారి మధ్య గొడవను సర్దుమణిగేలా చూడాలని ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామంలో ఉంటున్న పెద్ద అల్లుడు రమేష్‌ను మల్లయ్య కోరారు.
కుటుంబ సభ్యులను కాజీపేటకు రావాలని అక్కడే పంచాయతీ చేద్దామని అల్లుడు రమేష్ మల్లయ్యతో చెప్తాడు. కాజీపేటకు మల్లయ్య పంచాయతీ నిమిత్తం వారి కుటుంబసభ్యులతో కలిసి వెళ్తారు. ముందుగానే పథకం వేసిన మల్లయ్య పెద్ద అల్లుడు రమేష్.. మల్లయ్య బయలుదేరాడని తెలుసుకుని తన స్నేహితుడు ఎలుకతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్‌తో కలిసి ద్విచత్ర వాహనంపై పున్నేలులో అత్తగారి ఇంటికి వెళ్తాడు. సమీపంలో స్నేహితుడిని కాపలా ఉంచి ఇంటికి వేసిన తాళాన్ని పగలకొట్టి బీరువాలో బంగారం, వెండి, పథకం ప్రకారం నగదును చోరీచేసి వెళ్తాడు.
మల్లయ్య ఇంటికి వచ్చే సరికి తాళం తీసి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా ఆర్చర్యానికి గురవుతాడు. చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు పిర్యాదు చేస్తాడు. విచారణ చేపట్టిన ఐనవోలు ఎస్సై వెంకన్న సీసీ కెమెరాల ఆధారంగా అల్లుడే చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నగలు విక్రయించేందుకు వస్తున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారంతో నిఘా ఉంచారు. వరంగల్ కేంద్రంలోని ఇంతేజార్గంజ్ పోల్సిస్టేషన్ సమీపంలో ఆభరణాలు విశ్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని వారి నుంచి బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందిని డీసీపీ వెంకటలక్ష్మీ అభినందించారు.
Breaking News: ఏపీ సర్కార్ కు బిగ్ షాక్.. స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ
గుర్తించి పోలీసులకు పిర్యాదు చేస్తాడు. విచారణ చేపట్టిన ఐనవోలు ఎస్సై వెంకన్న సీసీ కెమెరాల ఆధారంగా అల్లుడే చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నగలు విక్రయించేందుకు వస్తున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారంతో నిఘా ఉంచారు. వరంగల్ కేంద్రంలోని ఇంతేజార్గంజ్ పోల్సిస్టేషన్ సమీపంలో ఆభరణాలు విశ్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని వారి నుంచి బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందిని డీసీపీ వెంకటలక్ష్మీ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal