కరోనా కష్టాలు : ఇప్పుడేం చేయాలి.. మృతి చెందిన తర్వాత కరోనా పాజిటివ్

కరోనా కష్టాలు : ఇప్పుడేం చేయాలి.. మృతి చెందిన తర్వాత కరోనా పాజిటివ్

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కష్టాలు : ఇప్పుడేం చేయాలి.. మృతి చెందిన తర్వాత కరోనా పాజిటివ్..అంత్యక్రియలకు హజరయిన బంధువుల్లో టెన్షన్ మొదలయింది..దీంతో వారంతా ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు.

  • Share this:


    కరోనా కష్టాలు రోజుకురోజుకు పెరగుతున్నాయి. సెకండ్ వేవ్‌తో మరోసారి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నిత్య జీవీతంలో ఎవరికి కరోనా ఉందో , ఎవరికి లేదో కూడ తెలుసుకులోనే స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. ఇలా ఓ వ్యక్తి ప్రాణాలతో ఉన్నప్పుడు కరోనా లేదని, ప్రాణం పోయిన తర్వాత కరోనా ఉందని పరీక్షల్లో తేలడంతో అంత్యక్రియలకు హజరైన బంధువులు , స్నేహితులు బెంబెలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో సంఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలో చోటుచేసుకుంది.

    వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆనారోగ్యానికి గురై గత రెండు రోజుల క్రితం చనిపోయాడు. అయితే ఆయన మృతి చెందడానికి ముందు స్థానిక పర్యతగిరి ఆసుపత్రిలో కరోనా టెస్ట్ చేయించుకోగా నెగిటీవ్ గా తేలింది. కాని దీంతో బంధువులు ,స్నేహితులు పెద్ద ఎత్తున హజరై అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మృతిచెందడానికి రెండు రోజుల ముందే మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై.. అనుమానం వచ్చి రోగి మరోసారి దగ్గరలోని మరో ఆసుపత్రిలో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. పరీక్ష చేయించుకున్న తర్వాత రెండు రోజులకు ఆయన మృతి చెందాడు. అయితే ఆయన చనిపోయి అంత్యక్రియలు అయిన తర్వాత కరోనా ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. దీంతో అంత్యక్రియలకు హజరైన వారు ఆందోళనకు గురవుతున్నారు. తమ పరిస్థితి ఏంటని ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. కాగా అదే గ్రామంలో ఇప్పటికే 20 మందికి కరోనా సోకినట్టు వైద్యులు చెబుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published: