హోమ్ /వార్తలు /తెలంగాణ /

Great Friend: ఫ్రెండ్ షిప్ అంటే ఇదే.. వాట్సాప్ స్టేటస్ తో ఫ్రెండ్ కుటుంబానికి సాయం..!

Great Friend: ఫ్రెండ్ షిప్ అంటే ఇదే.. వాట్సాప్ స్టేటస్ తో ఫ్రెండ్ కుటుంబానికి సాయం..!

వాట్సాప్ స్టేటస్ తో ఫ్రెండ్ కి సాయం చేసిన కానిస్టేబుల్

వాట్సాప్ స్టేటస్ తో ఫ్రెండ్ కి సాయం చేసిన కానిస్టేబుల్

Warangal: ఒకవైపు కట్టుకున్న భర్త ప్రమాదవశాత్తు మంచాన బారిన పడడం మరోవైపు భార్య గర్భిణీగా ఇబ్బంది ఉండడం చాలా బాధాకరమైన విషయంగా మారింది. అయితే ఓ దేవుడా ఏంటి మా పరిస్థితి అనుకున్న సమయంలో ఆపద్బాంధవుడులా వచ్చాడు భర్త స్నేహితుడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

పోలీస్ ఉద్యోగం అంటే శాంతి భద్రతలను కాపాడటమే కాదు ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం చేసి కాపాడటం కూడా. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు గొంతుతో పాటు.. పక్క ఎముకలు విరిగి మంచానికి పరిమితం అయ్యాడు. ఓ పోలీస్ కానిస్టేబుల్ అతని జీవితాన్ని చూసి పరితపించి సాయమందించాడు. శాయంపేట మండలం వసంతపూర్ కు చెందిన మంద రాములు వృత్తి రీత్యా ప్రైవేట్ ఉద్యోగి. పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొనడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రాములుకు గొంతుకు 24 కుట్లు వేయగా.. పక్క ఎముకలు విరిగి మంచానికి పరిమితమయ్యాడు. బాధితుడికి భార్య,ఓ కూతురు ఉంది. ప్రస్తుతం బాధితుడు భార్య గర్భిణీ కాగా మరో వారం రోజుల్లో డెలివరీకి రావాలని డాక్టర్ సూచించారు.

ఒకవైపు కట్టుకున్న భర్త ప్రమాదవశాత్తు మంచాన బారిన పడడం మరోవైపు భార్య గర్భిణీగా ఇబ్బంది ఉండడం చాలా బాధాకరమైన విషయంగా మారింది. అయితే ఓ దేవుడా ఏంటి మా పరిస్థితి అనుకున్న సమయంలో ఆపద్బాంధవుడులా వచ్చాడు భర్త స్నేహితుడు. రాములు పదవ తరగతి బ్యాచ్ స్నేహితుడు లాల్ సింగ్ ప్రస్తుతం చిట్యాలలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. రాములు ప్రమాదం గురించి తెలుసుకున్న లాల్ సింగ్ చలించిపోయాడు.

ఇది చదవండి: మీకు కేఎఫ్‌సీ తెలుసు.. మరి టీఎఫ్‌సీ తెలుసా..? టేస్ట్ మాత్రం సూపర్ హిట్..!

ఒకవైపు మంచానికే పరిమితమైన స్నేహితుడు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు చూసిన స్నేహితుడు లాల్ సింగ్ అతన్ని ఆదుకోవాలని నిర్ణయించుకొని సహాయం చేయాలంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టడంతో స్నేహితులు చూసి వారి వంతు సహాయంగా యాబై వేల రుపాయలు సాయంగా అందించారు. సేకరించిన డబ్బును స్నేహితుడు రాములుకు ఇచ్చి ధైర్యం చెప్పాడు లాల్ సింగ్.

తాను పెట్టిన వాట్సప్ స్టేటస్ చూసి సాయం అందించిన చిట్యాల గ్రామ ప్రజలకు తన తోటి సిబ్బందికి లాల్ సింగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని లాల్ సింగ్ కోరాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కానిస్టేబుల్ ను అభినందించారు. పోలీస్ అంటే లా అండ్ ఆర్డర్ ను కాపడమే కాదు ఆపదలో ఉన్న వారిని కూడా సాయం చేయాలని అంటున్నాడు కానిస్టేబుల్ లాల్ సింగ్.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు