WARANGAL CONGRESS TELANGANA STATE AFFAIRS IN CHARGE MANICKAM TAGORE HAS MADE SENSATIONAL ALLEGATIONS OVER THE CONSTRUCTION OF A RING ROAD IN WARANGAL PRV
Warangal Ring Road: వరంగల్ రింగ్ రోడ్డుపై కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ సంచలన ఆరోపణలు.. కొడుకు మంత్రి కొత్త ప్లాన్ అని..
మాణిక్కం ఠాగూర్ (ఫైల్ )
వరంగల్‌లో రింగ్ రోడ్ (Warangal ring road) నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి ఎక్కువగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ (Telangana)లో అభివృద్ధి చెందుతున్న వరంగల్‌పై (Warangal) రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వరంగల్‌ను కమిషనరేట్ చేసిన టీఆర్ఎస్ (TRS) నేతృత్వంలోని ప్రభుత్వం.. ఐటీ సంస్థలను కూడా నగరంలో విస్తరించాలని ప్రణాళికల్లో ఉంది. దీనిలో భాగంగా అక్కడ కూడా పెట్టుబడులు (Investments) పెట్టేందుకు కావాల్సిన వాతావరణాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోంది. ఇప్పటికే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (Kakatiya mega textile park) నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రాధాన్యమిస్తోంది. దీనిలో భాగంగా వరంగల్‌లో రింగ్ రోడ్ (Warangal ring road) నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ (congress) వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ (Manickam Tagore) ట్వీట్ చేశారు. కొడుకు మంత్రి కొత్త ప్లాన్ అని.. రియల్ ఎస్టేట్ మాఫియా (Real Estate mafia) నుంచి ఆదాయం కోసమే ఈ ప్లాన్ వేశారని ఠాగూర్ ఆరోపించారు. రింగు రోడ్డు కోసం 27 వేల ఎకరాలు సేకరిస్తున్నారని మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించడంతో కలకం రేగింది.
Koduku Mantri plan to increase his Income comes from Real estate mafia & Warangal Ring Road land are the latest ones 27000 acres of Land .. https://t.co/CRLPOYuXye
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 11, 2022
కాగా, వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కొన్ని రోజుల కిందట శంకుస్థాపన చేశారు. ₹ 1600 కోట్లతో నిర్మించనున్న కిటెక్స్ వస్త్ర పరిశ్రమలో దాదాపు 15 వేల మందికి ఉపాధి లభించనుంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో ఈ కిటెక్స్ టెక్స్టైల్ పరిశ్రమను ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిశ్రమకు భూమిపూజ అనంతరం గణేషా గ్రూప్ నిర్మించిన గణేషా ఎకోటెక్, గణేషా ఎకోపెట్ యూనిట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
కిటెక్స్ సంస్థ రూ. 3 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు వారిని తెలంగాణకు ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నం చేసి తీసుకొచ్చామన్నారు కేటీఆర్ . మీరు ఇక్కడ పెడితేనే వరంగల్ బిడ్డలకు న్యాయం జరుగుతుందని చెప్పి కిటెక్స్ సంస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సంస్థ రూ. 1600 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందన్నారు. దీంతో 15 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు.
కొరియాకు చెందిన యంగ్ వన్ అనే కంపెనీ రూ. 1100 కోట్లతో పెట్టుబడులు పెట్టబోతుందన్నారు. తద్వారా 12 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ రెండు కంపెనీలు కూడా 8 నుంచి 11 ఫ్యాక్టరీలు పెట్టబోతున్నాయని మంత్రి వివరించారు. రాబోయే 18 నెలల్లో పనులన్నీ పూర్తవుతాయని వివరించారు. భారతదేశంలో ఇలాంటి టెక్స్ టైల్స్ పార్కు ఎక్కడా లేదని కేటీఆర్ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.