హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: కాంట్రాక్ట్ కష్టాలు..! చేసేది కరెంట్ పని.. ఐనా జీవితాల్లో వెలుగేది..?

Warangal: కాంట్రాక్ట్ కష్టాలు..! చేసేది కరెంట్ పని.. ఐనా జీవితాల్లో వెలుగేది..?

X
electricity

electricity workers

తల్లిదండ్రులు కొడుకు బాగోగులు తాము ఇక చూడలేమని ఇటీవల హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ముందు వదిలేసి వెళ్లారు. సంస్థ ఉద్యోగి కానందున తామేమి చేయలేమని అధికారులు చెబుతున్నారని కార్యాలయం ఎదుట దయనీయ స్థితిలో ఉన్న రమేష్ ఆవేదనతో వ్యక్తం చేశాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

Santhosh, News 18, Warangal

విద్యుత్ సరఫరాలో ఏ లోపం వచ్చినా వెంటనే రంగంలోకి దిగే విద్యుత్ ఉద్యోగుల జీవితాలు చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఇళ్లలో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే వెంటనే మరమ్మతులు చేసి ఇళ్లలో వెలుగునిస్తారు. ఐతే వారి జీవితాలలో మాత్రం చీకటే కనిపిస్తోంది. ఉద్యోగ భద్రతకు, ప్రాణాలకు రక్షణ ఉండదు. వేతనం అంతంత మాత్రమే NPDCL ప్రత్యామ్నాయ ఉద్యోగులపై న్యూస్ 18 ప్రత్యేక కథనం..

Read Also : Rajanna Siricilla: సద్వాల్నా.. వద్దా సార్..! సిరిసిల్ల పిలగాండ్లకు పుస్తకాలే ఇయ్యలే

ప్రత్యామ్నాయ ఉద్యోగుల పని అడ్డుగా ఉన్న చెట్లని తొలగించడం, కాలిపోయిన ఫ్యుజ్ లను వేయడం చిన్నపాటి పనులతో పాటు రెగ్యులర్ సిబ్బందికి సహాయంగా ఉండటం వీరి పని. ఐతే లైన్ మెన్లు చేయవలసిన పనులను వీరితో చేయించడం జరుగుతుంది. కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ ఉద్యోగులకు సుమారుగా ఎనిమిది వేల వేతనం చెల్లిస్తారు. ఒక వేల కార్మికులు ఏదైనా ప్రమాదానికి గురైతే చికిత్స నిమిత్తం కార్డు మంజూరు చేస్తారు. ఇకప్రమాదవశాస్తు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడ్డట్టే.

రమేష్ అనే ప్రత్యామ్నాయ కార్మికుడు 2014లో ప్రమాదం జరిగి కుడి చెయ్యి కోల్పోయాడు. అప్పుడు ఫిర్యాదు చేయాలని భావించినా అధికారులకు నష్టం కలుగుతుందన్న ఉద్దేశంతో కొంత పరిహారం ఇచ్చి కేసు పెట్టకుండా చేశారు. అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెబితే నమ్మి ఏళ్ల తరబడి బాధితులు ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రత్యామ్నాయ కార్మికులతో ఎన్పీడీసీఎల్ అధికారులు వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ప్రమాదవశాస్తూ చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఫీల్డ్ వర్కర్లకు అందించే వేతనాలు ఇవ్వాలని.. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు పోలీస్ కేసులు నమోదు కాకుండా కొందరు అధికారులు మధ్యవర్తులు పరిహారం ఇచ్చి సరిపెడుతున్నారని బాధితులు అంటున్నారు.

అయితే ఇటీవల కాలంలో అనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ముందు జాగర్లపూడి రమేష్ అనే వ్యక్తి లింగాల గణపురం మండలం కొత్తపల్లిలో నియంత్రిక మరమ్మతు పనులు చేసే క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై నడుము విరిగిపోయింది. వైద్యం కొరకు కొంత సాయం అందినా ఆరోగ్యం చక్క పడలేదు.

తల్లిదండ్రులు కొడుకు బాగోగులు తాము ఇక చూడలేమని ఇటీవల హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ముందు వదిలేసి వెళ్లారు. సంస్థ ఉద్యోగి కానందున తామేమి చేయలేమని అధికారులు చెబుతున్నారని కార్యాలయం ఎదుట దయనీయ స్థితిలో ఉన్న రమేష్ ఆవేదనతో వ్యక్తం చేశాడు. మరి ఇలాంటి విషయాలపై ప్రభుత్వం, ఉన్నత అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న దానిపై వేచి చూడాలి.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు