హోమ్ /వార్తలు /తెలంగాణ /

Food poisoning : హాస్టల్‌లో అమ్మాయిలకు బల్లిపడిన అన్నం పెట్టారు .. వార్డెన్, కుక్ సస్పెండ్

Food poisoning : హాస్టల్‌లో అమ్మాయిలకు బల్లిపడిన అన్నం పెట్టారు .. వార్డెన్, కుక్ సస్పెండ్

HOSTEL STUDENTS

HOSTEL STUDENTS

Food poisoning: వర్ధన్నపేట బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌ వల్ల విద్యార్ధినులు ఆసుపత్రి పాలయ్యారు. ఈఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విచారణలో బల్లిపడిన అన్నం వడ్డించారని తేలడంతో వార్డెన్‌, కుక్‌ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

వరంగల్ (Warangal)జిల్లా వర్ధన్నపేట(Wardhannapet)పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ (Food poisoning)కావడం వల్ల సుమారు 50మంది విద్యర్ధినులు అస్వస్థతకు గురయ్యారు. ఈఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఘటనకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్ జ్యోతిHostel Warden Jyoti పాటు కుక్ వెంకట్‌(Cook Venkat)ని సస్పెండ్ (Suspend)చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత సుమారు 60మంది విద్యార్ధినులు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వరంగల్‌ ఎంజీఎంకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Revanth | Venkat Reddy : ఢిల్లీలోనూ గల్లీ రాజకీయాలే .. మునుగోడు అభ్యర్ధి విషయంలో ఎవరి ప్రయత్నాలు వాళ్లవే ..ఇద్దరిపై వేటు ..

ఈఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధుల అవస్థలు, సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. దీనికి అనుగూణంగానే హాస్టల్ సిబ్బంది, కుక్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్ధినుల పేరెంట్స్‌తో పాటు విద్యార్ధి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఈనేపద్యంలోనే సోమవారం రాత్రి బల్లి పడిన భోజనం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా వార్డెన్, కుక్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.

ఫుడ్ పాయిజన్‌ ఘటనపై విచారణ..

వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 5 నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. సోమవా రం రాత్రి భోజనంలో ఓ విద్యార్థినికి చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే కుక్‌ అన్నంలోని బల్లిని తేసిశాడు. అదే భోజనాన్ని అందరికి వడ్డించడం జరిగిందని విద్యార్ధినులు వాపోయారు. అదే కారణంతో విద్యార్ధినులు అనారోగ్యానికి గురయ్యారు. తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, మైనార్టీ హాస్టళ్లలో విద్యార్దులు నాసీరకం భోజనం కారణంగా ఆసుపత్రి పాలవుతున్న ఘటనలు గత రెండు నెలలుగా వరుసుగా వెలుగులోకి వస్తున్నప్పటికి ప్రభుత్వం వాటిని అరికట్టడం లేదు. ఇలాంటి విమర్శల నేపధ్యంలోనే వర్ధన్నపేట హాస్టల్‌ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Traffic Police : ఇకపై హైదరాబాద్‌లో హెల్మెట్‌ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తే ఫైన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు


ఆందోళనలు ఉధృతం..

ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందిచడంలో సర్కారు విఫలమైందని బీజేపీ నేతలతో పాటు విద్యార్ధి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న విద్యార్ధినులను వెంటనే హైదరాబాద్‌కు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. స్టూడెంట్స్‌కి ఏదైనా జరిగితే ప్రభుత్వమే దానికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Telangana News, Warangal

ఉత్తమ కథలు