Santosh, News18, Warangal.
కాకతీయుల కట్టడాలకు, శిల్ప కళావైభవానికి నిలయం ఓరుగల్లు నగరం. నిజాం కాలం నాటి కట్టడాలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ నగరం. అయితే పైన పటారం లోన లోటారంగా మారింది పరిస్థితి. కట్టడాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరానికి వస్తుంటారు టూరిస్టులు. ఇలాంటి వారికి రోడ్లు నరకాన్ని చూపిస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా రోడ్ల పరిస్థితి అద్వానంగా మారిపోయింది. వరంగల్ కేంద్రంలో ఉన్న అండర్ బ్రిడ్జి రెండు ప్రాంతాలను వేరు చేస్తుంది. ఈ బ్రిడ్జి కూడా నిజాం కాలం నాటి కట్టడమే. అయితే తరచూ బ్రిడ్జి వల్ల ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఎప్పుడూ రద్దీగా ఉండే అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని అధికారులు మరమ్మతుల పేరిట మూసేస్తుంటారు.
దీంతో నగరానికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అంతేకాదు వరంగల్ నుండి ఖమ్మం సూర్యాపేట విజయవాడ వెళ్లే దారి కూడా ఇదే పలు జిల్లాలకు వెళ్లడానికి ప్రధాన రహదారి కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతుల పేరుతో మళ్లీ అండర్ బ్రిడ్జ్ మూసివేయడం, వేరే దారి ఇరుగ్గా ఉండడంతో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎలాంటి దారి చూపకుండా బ్రిడ్జిని మూసి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
రైల్వే మూడో లైన్ పనుల వల్ల నరకం అనుభవిస్తున్నారు వరంగల్ ప్రజలు. హంటర్ రోడ్ లో ఉన్న చిన్న అండర్ బ్రిడ్జి కూడా ఇరుగ్గా ఉంటుంది. ఇతర గ్రామాల నుండి వరంగల్ నగరానికి లోపలికి ప్రవేశించాలంటే చిన్న అండర్ విచ్ నుండి వెళ్ళాలి. ఇక్కడ కూడా వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జ్ కింద ఎత్తు తక్కువగా ఉండేసరికి చాలామంది బ్యాలెన్స్ ఆగకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
WARANGAL: హిమాలయాల్లో మాత్రమే కనిపించే అద్భుతం.. వరంగల్‌లో ప్రత్యక్షం
నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో అధికారులు వెంటనేబాగు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులకు వెళ్లేవారు, ఉదయం కాలేజీకి వెళ్లేవారు, సమయానికి బస్సు కోసం వెళ్లాలంటే వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాండ్‌కు వెళ్ళాలి. అయితే చాలామంది రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నిస్తున్నారు. అలా దాటేటప్పుడు రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు స్పందించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal