Home /News /telangana /

WARANGAL CLASHES BETWEEN STUDENTS IN WARANGAL ONE STUDENT DIED KMM VB

Crime News: కిటికీ అద్దం పగలకొట్టారు.. దానికి కారణం ఎవరనే తేల్చుకునే పనిలో ఇలా జరిగింది..

సంజయ్ (ఫైల్)

సంజయ్ (ఫైల్)

Crime News: వరంగల్ జిల్లా నర్సంపేటలో దారుణం చోటు చేసుకుంది. నర్సంపేట బిట్స్ కాలేజీలో నలుగురు విద్యార్థుల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణం బలి తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  నలుగురు విద్యార్థుల(Students) మధ్య అర్ధరాత్రి(Late Night) వరకు ఘర్షణ జరిగింది. చిన్న వాగ్వాదంతో పెద్ద గొడవకు దారి తీసింది. దీంతో ఆగ్రహానికి చెందిన విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ విద్యార్థిని కాలేజ్ బిల్డింగ్ నుంచి కిందపడిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో కాలేజీ హాస్టల్ రెండో అంతస్తు(Second Floor) నుంచి కింద పడి ఓ విద్యార్థి మరణించాడు.

  రైల్వేస్టేషన్ వద్ద వారిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.. వారిని ప్రేమికులు అనుకున్నారు.. కానీ ఇంతలోనే..


  ఈ సంఘటన వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి శివారు బిట్స్ లో చోటుచేసుకుంది. ఎస్సై రాంచరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా కమలాపురం మండలం వంగపల్లికి చెందిన 18 ఏళ్ల నకీర్త సంజయ్‌ బిట్స్ లో పాలిటెక్నిక్‌(Politechnic) రెండో ఏడాది (Second Year) చదువుతున్నాడు. ఈ నెల 21న అతనితో పాటు శివసాయి(దుగ్గొండి మండలం మహ్మదాపురం), హరిరాజ్‌ (గూడూరు), మనోహర్‌ (హైదరాబాద్‌), కృష్ణంరాజు(చెన్నారావుపేట మండలం జల్లి) అనే విద్యార్థులు హాస్టల్‌లోకి వచ్చారు.

  అతడి వద్ద సెక్రటరీగా ఆమె పని చేస్తుంది.. పని ఉందంటూ ప్లాట్ కు రప్పించుకున్నాడు యజమాని.. చివరకు ఇలా జరిగింది..


  22న శివసాయి కిటికీని తీసే క్రమంలో అద్దం పగిలింది. దీంతో కళాశాల క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎవరు అద్దం పగలగొట్టారో చెప్పాలని.. లేదంటే గదిలో ఉండే అయిదుగురు రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తల్లిదండ్రులను పిలిపించి విషయాన్ని చెప్పి పంపారు. శుక్రవారం రాత్రి భోజనం చేశాక గదిలో ఉన్న హరిరాజ్‌, మనోహర్‌, కృష్ణంరాజులు అద్దం పగలగొట్టిన నువ్వే జరిమానాను భరించాలని శివసాయితో చెప్పారు.

  Tragedy Love Story: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇంత దారుణమా.. చెవి, ముక్కులో విషాన్ని లోపలికి పంపి.. చివరకు..


  అందరం కలిసి చెల్లిద్దామని సంజయ్‌ సూచించాడు. తాను ఇవ్వలేనని శివసాయి వాదించడంతో వారి మధ్య గొడవ జరిగింది. పెనుగులాటలో కిటికీ సమీపంలో ఉన్న సంజయ్‌ అందులోంచి జారి కిందపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని నర్సంపేటకు తరలించి, అక్కడి నుంచి హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

  చికిత్స పొందుతూ సంజయ్‌ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. సంజయ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Cirme, Crime news, Warangal

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు