ఇటీవల కాలంలో రకరకాల ఫుడ్ ఐటమ్స్ తో, కొత్త కొత్త థీమ్స్ తో హోటల్స్, రెస్టారెంట్స్ వచ్చేస్తున్నాయి. వీరంతా భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే, గ్రిల్ చికెన్, గ్రిల్డ్ ప్రాన్స్, లాంటి రకరకాల గ్రిల్డ్ ఐటమ్స్ ఐటమ్స్ కు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే పలు రెస్టారెంట్లు ఈ తరహా గ్రిల్డ్ తో ఆకట్టుకుంటున్నారు. డిఫరెంట్ టేస్టీ ఫుడ్ ఐటమ్స్ తో పాటు చికెన్ ప్రాంకీలు, మటన్ ప్రాంక్, పన్నీరు ప్రాంక్ లతో ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నారు.
ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే హోటల్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో రకరకాల ఫుడ్ ఐటమ్స్ రారమ్మంటున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి మస్టర్లను తీసుకువచ్చి కస్టమర్లను ఆకర్షించే విధంగా రెస్టారెంట్స్ హోటల్స్ నిర్వాహకులు ఐటమ్స్ తయారు చేయిస్తున్నారు. కానీ ఇతర ప్రాంతాల వారే అంత అద్భుతంగా వండగలరా, మేము కూడా ఎంతో రుచికరమైన వంటకాలను అందిస్తామంటూ ముందుకు వస్తున్నారు లోకల్ షెఫ్స్.
వరంగల్ కేంద్రానికి చెందిన సూర్య ప్రకాష్ గత 12 సంవత్సరాలుగా చికెన్ ప్రాంకీలు తయారు చేస్తున్నాడు. ఈ చికెన్ ప్రాంకీ తయారు చేయడానికి కావలసిన వస్తువులు అన్నీ కూడా రెడీ మేడ్కాకుండా ఇంట్లోనే తయారు వేసుకొని వస్తున్నాడు సూర్య ప్రకాష్. ఎందుకంటే రెడీమేడ్ మసాలా, చపాతిలలో అంతగా నాణ్యత ఉండదు కాబట్టి తానే సొంతంగా తయారు చేసుకుంటున్నట్లు చెప్తున్నాడు. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఎగ్ కర్రీ, పన్నీర్ కర్రీ అన్ని ఇంట్లోనే తయారుచేసుకొని షాపు వద్దకు తీసుకొచ్చి అమ్ముతున్నాడు.
కస్టమర్ల టేస్ట్ ని బట్టి ఎవరికి ఎలాంటి ప్రాంకీ కావాలో ఇక్కడే తయారుచేసి కస్టమర్లకు అందిస్తాడు. తన వద్ద పన్నీర్, చికెన్, మటన్, ఎగ్ ప్రాంక్ లు లభిస్తాయని.. రుచి మాత్రమే కాదు ఇందులో వాడే ప్రతి ఒక్క వస్తువు నాణ్యతా పరమైనవే వాడతానని చెప్తున్నాడు. అందుకే తన వద్దకు ఎక్కడెక్కడ నుంచో కస్టమర్స్ వస్తుంటారని.. ఒక్కసారి ఇక్కడ తిన్న కస్టమర్స్ మళ్లీ మళ్లీ వచ్చి ఇక్కడే తింటుంటారని సూర్యప్రకాష్ చెప్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal