హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news : లేడీ సీఐతో మరో సీఐ సీక్రెట్ రిలేషన్‌షిప్ ..ఇద్దర్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది ఎవరో తెలుసా ..?

Crime news : లేడీ సీఐతో మరో సీఐ సీక్రెట్ రిలేషన్‌షిప్ ..ఇద్దర్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది ఎవరో తెలుసా ..?

POLICE(FILE)

POLICE(FILE)

Crime news: అసాంఘీక శక్తులకు చుక్కలు చూపిస్తూ మూడో సింహం పవర్ చూపించాల్సిన సీఐ..తోటి మహిళా సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తో క్లోజ్‌గా మూవ్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈవ్యవహారాన్ని మహిళా సీఐ భర్తే బయటపెట్టడంతో సదరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై పోలీస్ కేసు నమోదైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

సమాజంలో పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూసే పోలీసు అధికారే దారి తప్పారు. అసాంఘీక శక్తులకు చుక్కలు చూపిస్తూ మూడో సింహం పవర్ చూపించాల్సిన సీఐ..తోటి మహిళా సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తో క్లోజ్‌గా మూవ్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈవ్యవహారాన్ని మహిళా సీఐ భర్తే బయటపెట్టడంతో సదరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై పోలీస్ కేసు(Police) నమోదైంది. పోలీస్ శాఖకు అపకీర్తి తెచ్చే విధంగా ఉన్న ఈ సంఘటన వరంగల్(Warangal)జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Munagodu: మునుగోడు ఉపఎన్నిక బాధ్యత వాళ్లిద్దరికే అప్పగింత .. కేసీఆర్‌ ప్లాన్‌ వర్కవుటయ్యేనా..?

సీఐల మధ్య రహస్య వ్యవహారం..

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఒక లేడీ సీఐ, మరో సీఐ అధికారి మధ్య ఉన్న సాన్నిహిత్యం బయటపడింది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఇద్దరు సీఐల మధ్య సీక్రెట్‌ రిలేషన్‌షిప్ కొనసాగుతోందంటూ మహిళా సీఐ భర్తకు అనుమానం రావడంతో వారిపై నిఘా పెట్టి పట్టుకున్నారు. వరంగల్‌ సీఐడీ కార్యాలయంలో సీఐగా పనిచేస్తున్న బలభద్ర రవి అనే సీఐ హనుమకొండ రామ్‌నగర్‌కు చెందిన మహిళా సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఇద్దరూ ఒకే విభాగంలో సీఐలుగా పని చేస్తున్నారు. ఆ చనువుతోనే ఇద్దరూ పరస్పరం మాట్లాడుకోవడం, కలుసుకోవడం చేస్తుండటాన్ని మహిళా సీఐ భర్త గుర్తించాడు.

సీక్రెట్ రిలేషన్‌ ఉన్నట్లేనా ..

ఇద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్‌షిప్ కొనసాగుతోందనే అనుమానంతోనే నిఘా పెట్టాడు. సీఐ బలభద్ర రవి తాను లేని సమయంలో ఇంటికి వచ్చి భార్యతో మాట్లాడుతుండటంతో తన స్నేహితులతో కలిసి వచ్చి పట్టుకున్నారు. ఇద్దరు సీఐల మధ్య సీక్రెట్‌ రిలేషన్‌ని బయటపెట్టిన మహిళా సీఐ భర్త కూడా మహబూబ్‌నగర్ జిల్లాలో రూరల్‌ సీఐగా పని చేస్తున్నాడు. తన భార్యతో మరో సీఐ పట్టుబడటంతో బలభద్ర రవిని వరంగల్ పోలీస్ కమిషరేట్‌ పరిధిలోని సుభేదారి పోలీసులకు అప్పగించారు. అతనిపై కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రవి పదే పదే తాను లేని సమయంలో ఇంటికి వస్తున్నాడని అడ్డుకుంటే తనను చంపుతానని బెదిరించినట్లుగా కంప్లైంట్ చేయడంతో ఐపిసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సుబేదారి పోలీసులు తెలిపారు.

Hyd | Metrorail : ఎక్కడిక్కడ నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు.. కారణం ఏంటో తెలుసా..?

విచారణ జరుగుతోంది...

సోమవారం సాయంత్రం ఈఘటన జరిగింది. అయితే పోలీసులకు సంబంధించిన విషయం కావడంతో సుబేదారి పోలీసులు గోప్యంగా ఉంచారు. సీఐ రవిపై అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించారనే సెక్షన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళా సీఐ మరో సీఐ బలభద్ర రవి మధ్య ఎలాంటి సంబంధం ఉందనేది దర్యాప్తు చేస్తున్నామని సీఐ షుకుర్‌ తెలిపారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Telangana crime news, Warangal

ఉత్తమ కథలు