Home /News /telangana /

WARANGAL CANNABIS SMUGGLING GANG ARRESTED IN WARANGAL PRV

Smuggling: వరంగల్​లో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు

వరంగల్​​లో గంజాయిని మీడియాకు చూపుతున్న పోలీసు అధికారి

వరంగల్​​లో గంజాయిని మీడియాకు చూపుతున్న పోలీసు అధికారి

గంజాయి స్మగ్లింగ్​కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను టాస్క్​ఫోర్స్​, పరకాల పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ ముఠా నభ్యుల నుంచి సుమారు రూ.6 లక్షల 40 వేల విలువ జేసే గంజాయితో పాటు ఒక ట్రాలీ ఆటో, ఒక ద్విచక్రవాహనం, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
  వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్​కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను టాస్క్​ఫోర్స్​, పరకాల పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ ముఠా నభ్యుల నుంచి సుమారు రూ.6 లక్షల 40 వేల విలువ జేసే గంజాయితో పాటు ఒక ట్రాలీ ఆటో, ఒక ద్విచక్రవాహనం, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడైన బోచ్చు భానుచందర్ హన్మకొండ గోపాల్‌పూర్ ప్రాంతంలో నివాసం ఉంటూ పరకాల ప్రాంతానికి వచ్చి వెళతుండేవాడని, పలుమార్లు గంజాయి స్మగ్లింగ్​కు పాల్పడినందుకు పరకాల, ములుగు ఘన్​పూర్ పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారని తెలిపారు. కొద్ది నెలల క్రితమే గంజాయి అమ్మకాలకు పాల్పడినందుకు భానుచందర్​ను ఆత్మకూర్ పోలీసులు అరెస్టు చేసి, రౌడీషీట్ కూడా తెరవడం జరిగిందన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. భానుచందర్ పలుమార్లు జైలుకు వెళ్లి, జైలులో మరో నిందితుడు సుమన్ రెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. మిగతావారు కూడా భానుచందర్​కు​​ పరిచయస్తులు కావడంతో వీరందరు కలిసి ఒక ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు.

  ఆటో వెనక భాగంలో రహస్య ప్రాంతం..

  భానుచందర్ గంజాయి అమ్మకాల్లో అనుభవం వుండటంతో ఈ ముఠా సభ్యులు విశాఖపట్నం జిల్లా, సీలేరు ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయి కోనుగోలు చేసేవారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రాంతంలో ఎక్కువ మొత్తానికి అమ్మి, వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు ప్రణాళికను రూపొందించుకున్నారు. కాగా, ఈ ముఠా సభ్యులు సిలేరు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద 70 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, వాటిని రెండు కిలోల చొప్పున ప్యాకింగ్ చేసేవారు. నిందితుల్లో ఒకడైన రత్నాకర్​కు చెందిన ట్రాలీ ఆటోను ఏవరికీ అనుమానం రాకుండా ఆటో వెనుక భాగంలో అదనంగా ఒక కంపార్ట్ మెంట్ ఏర్పాటు చేసి దానిలో గంజాయిని రహస్యంగా పరకాల ప్రాంతానికి తరలించేవాడు. నిందితుడు రత్నాకర్ ఇంటి వద్ద రహస్యంగా గంజాయి వున్న ఆటోను భద్రపర్చారు.

  పక్కా సమాచారంతో దాడి..

  శనివారం నాడు గంజాయికి ఎక్కువ ధరకు అమ్మేందుకు ఈ ముఠా సభ్యులు ట్రాలీ ఆటోను వరంగల్ తీసుకొస్తున్న క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. పరకాల మండల కేంద్ర శివారు ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై, ట్రాలీ ఆటోలో వస్తున్న నిందితుల వాహనాలను పోలీసులు ఆపారు. ట్రాలీ ఆటోను క్షుణ్ణంగా తనిఖీ చేయగా రహస్యంగా ఏర్పాటు చేసిన కంపార్ట్ మెంట్లో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, పరకాల, టాస్క్​ఫోర్స్ ఏసీపీలు శివరామయ్య, ప్రతాప్ కుమార్ టాస్క్​ఫోర్స్ ఇన్స్​స్పెక్టర్​ మధు, పరకాల ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి, టాస్క్​ఫోర్స్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజు, రాజేష్, శ్రవణ్, చిరు, హోంగార్డ్ విజయ్​లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

  పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు:

  - బొచ్చు భానుచందర్, పరకాల, వరంగల్ రూరల్ జిల్లా, (ప్రస్తుత నివాసం హన్మకొండ గోపాలపురం)

  -. వసుల రత్నాకర్, పెద్దంవల్లి గ్రామం, రేగొండ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.

  - గుర్రాల సుమన్ రెడ్డి, రేగొండ గ్రామ, మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా

  - ఉకంటి వీరారెడ్డి, తిరుమల్​గిరి గ్రామం, రేగొండ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా

  - గుగులోత్ హీరు, ప్రశాంత్ నగర్, కాజీపేట, వరంగల్ అర్బన్ జిల్లా

  - నకినాల నరేష్, పెద్దంపల్లి గ్రామం, రేగొండ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా

  - మోతపోతుల రమేష్ గౌడ్, రేగొండ గ్రామం, మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Smuggling, Warangal

  తదుపరి వార్తలు