హోమ్ /వార్తలు /తెలంగాణ /

కిరాణా సామాన్లు కొంటున్నారా.. కొలత సరిగానే ఉందా?!..

కిరాణా సామాన్లు కొంటున్నారా.. కొలత సరిగానే ఉందా?!..

కిరాణా షాపులో నిలువు దోపిడి

కిరాణా షాపులో నిలువు దోపిడి

Telangana: వినియోగదారుల రక్షణలో తూనికల కొలతల శాఖ వైఫల్యం చెందింది. మనం నిత్యం ఎన్నో రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

వినియోగదారుల రక్షణలో తూనికల కొలతల శాఖ వైఫల్యం చెందింది. మనం నిత్యం ఎన్నో రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే నాణ్యమైన వస్తువులను పొందటం వినియోగదారులుగా మన హక్కు. ఈ హక్కులను మహుబూబాద్ధ్ జిల్లా గూడూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యాపారస్తులు తుంగలో తొక్కుతూ అక్రమ సంపదనే ధ్యేయంగా అమాయక ప్రజలను మోసం చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో అనేక కిరాణా షాపులతో పాటు అనేక చికెన్ షాపులుపుట్టగొడుగులలా వెలిశాయి. అయితే, ఈ చికెన్ షాపులలో కిలో చికెన్ తీసుకుంటే అది 700 గ్రాములు మాత్రమే తూకం వస్తుంది.

తూకం వేస్తున్న క్రమంలో అక్కడ కిలో బాటను పరిశీలిస్తే అది 1000 గ్రాములని ముద్ర కలిగి ఉంటుంది. కానీ, చికెన్ మాత్రం 700 గ్రాములే వస్తుంది. ఈ విధంగా స్థానిక ప్రజలు మోసపోతున్నారు. వినియోగదారులు ఎన్నో రకాలుగా మోసాలకు గురవుతూనే ఉన్నారు. ఒకవైపు గ్రామాలలోని కిరాణా షాపులలో కల్తీ నూనె అమ్ముతున్నారని ప్రచారం జరుగుతున్నా పట్టించుకున్న వారు లేరు.

మరోవైపు కొలతలు, తూనికలలో మోసాలను నివారించాల్సిన లీగల్ మెట్రాలజీ అధికారులు ఏ మాత్రం పట్టించుకవడం లేదు. ప్రతి వస్తువుపై ఎమ్మార్పీ రేటు కంటే అధిక ధరలను అమ్ముతూ స్థానిక వ్యాపారస్తులు భారీ మొత్తంలో దోపిడీ చేస్తున్నారు. కిరాణా షాపులలో కల్తీల వ్యవహారం అధికంగా నడుస్తున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గూడూరు మండలంలోని ప్రధానంగా గుండెంగా, మదనాపురం, పొనుగోడు, రాములు తండా, బోల్లెపల్లి, ఊట్ల మట్టివాడ గ్రామాలలో అధికంగా మోసాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. స్థానిక పెట్రోల్ బంక్ లలో కూడా భారీ స్థాయిలో మోసాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. వినియోగదారుల సంరక్షణలో ముందుండి కాపాడాల్సిన లీగల్ మెట్రాలజీ శాఖ మహబూబాబాద్ జిల్లాలో అసలు కనిపించడమే మానేసింది. ఏజెన్సీ గ్రామాలతో పాటు గూడూరు మండలంలోని వివిధ గ్రామాలలో వ్యాపారస్తులు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నా అధికారుల పర్యవేక్షణ మాత్రం కంటికి కరువై పోయింది. ఇప్పటికైనా తునికల కొలతల శాఖ అధికారులు స్పందించి జిల్లాలోని గ్రామాలలో షాపులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు