Balakrishna, News 18, secundrabad
సాధారణంగా మనకు ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ ప్రశ్నకు ఎవరైనా సముద్రం అడుగున దొరుకాతాయనే సమాధానంగా చెబుతారు. అయితే మన పొలంలో కూరగాయాలు పండించినట్లు ముత్యాలను (Pearl Farming) పండిస్తే ఎలా ఉంటుంది? ఏంటీ సముద్రం అడుగున అరుదుగా దొరికే ముత్యాలను పొలంలో కూరగాయాలు పండించినట్లు పండించడమేంటని ఆశ్యర్యపోతున్నారా? అయితే మీరు సలామ్ గురించి తెలుసుకోవాల్సిందే. అందరు రైతులు కాస్త రాబడి కోసం ఎప్పుడు ఏవో ఒక కొత్త పంటలు వేస్తూనే ఉంటారు. అయితే జనగాం(Jangoan) కు చెందిన సలామ్ మాత్రం అసలు పంటల్లో ఏముంది అనుకున్నాడు.
Gold Investments: పడిపోతున్న ధరలు.. బంగారం కొనేందుకు ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు!
ఏదైనా కొత్త పంట పండించాలనుకున్నాడు. ఇప్పటికే అందరూ పండించిన పంటలు కాకుండా వేరే వాటిపై చాలా పరిశోధన చేశాడు. అప్పటికే దుబాయ్ లో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సలామ్ కు కొన్ని రోజుల పరిశోధన తరువాత ఒక ఆలోచన వచ్చింది. అనుకున్నదే ఆ ఆలోచననే ఇప్పుడు సలామ్ ను వార్తల్లో నిలిచేలా చేసింది. సముద్రంలో మాత్రమే అరుదగా దొరికే ముత్యాలను ఇంట్లోనే పండిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో దుబాయ్ నుంచి ఇండియాకు పయనమైయ్యాడు సలామ్. వచ్చిన వెంటనే తనకున్న పొలంలో ట్యాంకులను ఏర్పాటు చేసి అందులో అల్చిప్పలు వేసి ముత్యాలు సాగు ప్రారంభించాడు. సలామ్ పండిస్తోన్న ముత్యాలు ప్రస్తుతం ముంబాయ్, చెన్నైతో పాటు తాను చిరుద్యోగం చేసిన దుబాయ్ కి కూడా ఎగుమతి అవుతున్నాయంటే ఆయన కృషి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ICICI FD Rates: ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం.. వారికి అదిరిపోయే శుభవార్త!
తనకున్న పొలంలో 12 /12 నిల ట్యాంకులను ఏర్పాటు చేసుకొని ఒక్కొ ట్యాంకు లో ఐదు వేల ఆల్చిప్పలు వేసి సాగు చేస్తోన్నాడు. తొలిత 12 లక్షలు నష్టం వచ్చినప్పటికి ముత్యాల సాగులో మెలుకువలు మెల్లగా తెలుసుకొని లాభాల వైపు అడుగేశాడు సలామ్. సలామ్ సాగు చేస్తోన్న అల్చిప్పలు ఒక్కటిలో దాదాపు రెండు నుంచి మూడు వరకు ముత్యాలు ఉత్పత్తి అవుతాయి. ఆ లెక్కన 5 వేల ఆల్చిప్పల్లో దాదాపు 10 వేల పెరల్స్ వరకు ఉత్పత్తి చేయొచ్చని అంటున్నారు సలామ్. ముత్యాలు ఉత్పత్తి అవడానికి 15 నెలల నుంచి 18 నెలల సమయం వరకు పడుతుందని అంటున్నారు సలామ్. ప్రస్తుతం మార్కెట్ లో ధర్డ్ గ్రేడ్ ముత్యాలు ఒక్కో ధర 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంది.
ఆ లెక్కన చూసుకున్న 12/12 ట్యాంక్ లో ఐదు వేల ఆల్చిప్పల నుంచి 10 వేల ముత్యాలకు కోటి రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఐదు వేల ఆల్చిప్పలు దాదాపు 80 వేల పెట్టుబడితో పాటు దాణా అన్ని కలుపుకొని ఏడాదికి ఖర్చు పది లక్షల లోపే ఉంటుంది. ఏడాది కోటి రూపాయలు వరకు ఆదాయం పొందొచ్చు అంటున్నారు సలామ్. అయితే ముత్యాల సాగుపై ప్రభుత్వం కూడా రైతుల్లో అవగాహన కల్పిస్తే మరి కొంత మంది రైతులు ముందుకొచ్చి ఈ సాగు చేస్తారని అంటున్నారు సలామ్. ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదిస్తే ఈ సాగులో మెలుకువలతో పాటు సాగుకు సంబంధించిన విషయాలు చెబుతానంటున్నారు ఈ ఆదర్శ రైతు సలామ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Secunderabad, Telangana