Home /News /telangana /

WARANGAL BUS ACCIDENT IN PEDDAPALLI DISTRICT CAR COLLIDE WITH RTC BUS THEN BOTH VEHICLES FELL INTO VALLEY SSR

Peddapalli Bus Accident: పెద్దపల్లి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. లోయలోకి పడిపోవడంతో...

లోయలోకి పడిపోయిన బస్సు, కారు

లోయలోకి పడిపోయిన బస్సు, కారు

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎక్లాస్‌పూర్‌‌లో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సు, కారు లోయలోకి దూసుకెళ్లాయి. బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.

ఇంకా చదవండి ...
    పెద్దపల్లి: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో (Peddapalli District) విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎక్లాస్‌పూర్‌‌లో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సు, కారు లోయలోకి దూసుకెళ్లాయి. బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.

    పరకాల డిపోకు చెందిన బస్సు బెల్లంపల్లి నుంచి హన్మకొండకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

    బస్సులోని 16 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. అయితే.. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం లేదు. కారు నడిపిన డ్రైవర్ పేరు వినీత్‌గా తెలిసింది. కారులో అతను ఒక్కడే ఉన్నట్లు సమాచారం.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Bus accident, Latest news, PEDDAPALLI DISTRICT, Telangana crime news, Warangal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు