హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: అధికార పార్టీ చెందిన సర్పంచ్ ఆత్మహత్యయత్నం.. కారణం ఇదే..!

Warangal: అధికార పార్టీ చెందిన సర్పంచ్ ఆత్మహత్యయత్నం.. కారణం ఇదే..!

సూసైడ్ చేసుకున్న సర్పంచ్

సూసైడ్ చేసుకున్న సర్పంచ్

Telangana: ఉమ్మడి వరంగల్ జిల్లా దంతాలపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో ఓవైపు కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Santhosh, News 18, Warangal)

ఉమ్మడి వరంగల్ జిల్లా దంతాలపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో ఓవైపు కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. మరోవైపు కుటుంబంలో నెలకొన్న సమస్యలతో మనస్థాపానికి గురైన దంతాలపల్లి మండలంలోని వీరిశెట్టి గూడెం గిరిజన సర్పంచ్ గుగులోతు నెహ్రూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సర్పంచ్ నెహ్రూ భార్య రజిత తెలిపిన వివరాల ప్రకారం బిరిశెట్టిగూడెం గ్రామ అభివృద్ధి పనుల కోసం సర్పంచ్ నెహ్రూను సుమారు 7 లక్షల రూపాయలు అప్పుచేసి గ్రామ అభివృద్ధి పనులు చేశాడు. గతంలో గ్రామంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెక్కులపై సర్పంచ్ ఉప సర్పంచ్ల మధ్య వ్యత్యాసం రావడంతో సంతకాలు కాలేదు. ప్రస్తుతం. గ్రామపంచాయతీలో నిధులు లేక ,తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాలేదు.

మనోవేదనకు గురైన సర్పంచ్ నెహ్రూ తాను వ్యవసాయ పనికి వెళ్తున్నానని చెప్పి బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆపై కొద్దిసేపటి తర్వాత ఇంటికి రావడంతో తండ్రి పురుగుల మందు తాగడానికి గుర్తించిన కుమారుడు నవీన్ స్థానికుల లబోదిబోమన్నారు. వెంటనే చికిత్స నిమిత్తం తొర్రూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

అధికార బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఆత్మహత్య ప్రయత్నంకు పాల్పడడంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతుంది .కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు గ్రామ ఉపసర్పంచ్ స్వాతి ఆమె భర్త వెంకన్న గ్రామస్తులు ఎస్కే పాషా, నరేంద్ర పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తన తండ్రి చాలా ధైర్యవంతుడు అని నిత్యం ప్రజా సేవలో ప్రజల కొరకు వారికి ఏదో ఒకటి చేయాలని తపన పడుతూ ఉండే మనిషి అని తన తండ్రి నెహ్రూ ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన వారిపై కఠినమైన చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు