హోమ్ /వార్తలు /తెలంగాణ /

ప్రేమించాడు.. ఆమెతో ఎన్నో కలలు కన్నాడు.. ప్రేమను ప్రపోజ్ చేసేసరికి ఆమె చెప్పిన సమాధానం ఎంటో తెలుసా.

ప్రేమించాడు.. ఆమెతో ఎన్నో కలలు కన్నాడు.. ప్రేమను ప్రపోజ్ చేసేసరికి ఆమె చెప్పిన సమాధానం ఎంటో తెలుసా.

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: కరోనా కాలంలోనే అతడు పదో తరగతి పూర్తి చేశాడు. మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇటర్ మీడియట్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ ఓ యువతిని ప్రేమించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఈ ప్రేమ విషయం చెప్పాడు. కానీ ఆమె ఇచ్చిన సమాధానానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...

కరోనా(Corona) కాలంలోనే అతడు పదో తరగతి పూర్తి చేశాడు. మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇటర్ మీడియట్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ ఓ యువతిని ప్రేమించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఈ ప్రేమ(Love) విషయం చెప్పాడు. కానీ ఆమె ఇచ్చిన సమాధానానికి తట్టుకోలేక ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం సంతులాల్‌పోడు తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. సంతులాల్‌పోడు తండా చెందిన 19 ఏళ్ల యువకుడు గంధంపల్లి–కొత్తపేటకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ రోజు నుంచి ఆమెను ఎంతో ఇష్టపడ్డాడు.

కన్న కూతురుపై అత్యాచారం చేయబోయాడు.. కానీ ఆమె ఇలా చేస్తుందని ఊహించలేకపోయాడు.. ఏం చేసిందంటే..


ఆమె కూడా అతే కాలేజీలో చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ రోజు అతడు ధైర్యం చేసి ఆమెకు ప్రేమిస్తున్నాను అంటూ చెప్పాడు. కానీ ఆమె చెప్పిన సమాధానంతో చాలా బాధపడ్డాడు. ఆమె వరసుకు చెల్లి వరుస అవుతాను.. తనను ప్రేమించవద్దు.. ఆ ఆలోచన మార్చుకొమ్మని సదరు యువతి చెబుతుంది. దీంతో అతడు తీవ్రంగా మనస్థాపం చెందాడు. ఆ రోజు నుంచి తిండీ తిప్పలు లేకుండా.. బాధపడుతూ ఉన్నాడు.

Women Sarpanch: ఆ గ్రామంలో అతడు చేసిన పనికి.. మహిళా సర్పంచ్ ఎంత పని చేసిందో తెలుసా..


ఇలా ఐదు రోజుల వరకు తనలో తానే క్రుంగిపోతూ ఎంతో మదన పడ్డాడు. ఓ రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చెందాడు. మృతుడి తండ్రి భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్‌ తెలిపారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. మరో ఘటనలో.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌ తండాకు చెందిన శ్రీనివాస్‌ నాయక్‌ అనే వ్యక్తి, మాచారం తండాకు చెందిన పాల్‌ త్యావత్‌ సిరి అపూ(30)ను 12 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి కొన్నాళ్ల క్రితమే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే రెండేళ్ల క్రితం సర్పంచ్ ఎన్నికల్లో ఆమె నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొద్ది నెలల కిందట ఆమె భర్త అయిన శ్రీనివాస్‌ నాయక్‌ అదే తండాకు చెందిన ఓ వివాహితను తీసుకెళ్లిపోయి రెండో పెళ్లి చేసుకున్నాడు.

Car Driver: డ్రైవర్ కదా అని నమ్మాడు.. చివరకు యజమానికి టోపీ పెట్టేశాడు.. ఏమైందంటే..


ఈ నెల 14న ఆ మహిళతో కలిసి సొంత గ్రామం అయిన నసురుల్లాబాద్ తండాకు వచ్చాడు. దీంతో భార్య తన భర్తతో గొడవ పడింది. ఎందుకు ఈ పని చేశావు.. తనను మోసం చేశావని అడగడంతో అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ విషయంలో కొద్ది రోజులుగా వారు తరచూ గొడవలు పడ్డారు. భర్త చేసిన పని సహించలేని ఆ మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు యత్నించింది. ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.

First published:

Tags: Attempt to suicide, Crime, Crime news, Love, Love affair

ఉత్తమ కథలు