• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • WARANGAL BHUPALPALLY MLA GANDRA VENKATARAMANA REDDY HAS DENIED THE ALLEGATIONS AGAINST HIM VS

పాలిటిక్స్ : హెచ్ఆర్సీ ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే గండ్ర..రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపణ

పాలిటిక్స్ : హెచ్ఆర్సీ ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే గండ్ర..రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపణ

MLA Gandra venkata ramana reddy

హెచ్ఆర్సీ ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే గండ్ర..రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపణ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు కొట్టిపారేశారు.

  • Share this:


హెచ్ఆర్సీ ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే గండ్ర..రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపణ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు కొట్టిపారేశారు. తనను రాజ‌కీయంగా దెబ్బ‌తీసేందుకు కుట్ర చేస్తున్నార‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. రేగొండ మండ‌లం రూపిరెడ్డిప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ బండారి క‌విత‌, ఆమె భ‌ర్త దేవేంద‌ర్‌ను తాను దూషించ‌లేద‌ని, వారే త‌నపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఎమ్మెల్యే తెలిపారు. భూపాలపల్లి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆరోజు జరిగిన పరిణామాలను ఆయన వివరించారు.

స‌ర్పంచ్ బండారి క‌విత‌, ఆమె భ‌ర్త దేవేంద‌ర్‌తో పాటు మండ‌లంలోని ఇత‌ర గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఈ నెల 4వ తేదీన త‌న‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా దాదాపు గంట పాటు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాము. కానీ ఎవ‌రినీ కించ‌ప‌రిచేలా దూషించ‌లేదని గండ్ర స్ప‌ష్టం చేశారు. త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని ఈ సంధర్భంగా పేర్కొన్నారు. నియోజ‌క‌వర్గంలోని ప్ర‌జ‌ల‌కు అన్ని ర‌కాలుగా అండ‌గా ఉన్నాన‌ని, రాజ‌కీయ అవ‌కాశాలు క‌ల్పించాన‌ని తేల్చిచెప్పారు. తాను ఎవ‌రికీ క్ష‌మాప‌ణ చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. త‌న‌పై ఆరోప‌ణ‌లు మానుకోక‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి హెచ్చ‌రించారు.

కాగా రూప్‌రెడ్డిపల్లె గ్రామ సర్పంచ్ బండారు కవిత ఆమె భర్త దేవెందర్ లు ఎమ్మెల్యే నుండి తనకు ప్రాణహాని ఉందంటూ రెండు రోజుల క్రితం హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు.గ్రామ అభివృద్ది నిధులు అడిగేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లిన తమని అవహేళన చేస్తూ..బెదిరింపులకు పాల్పడ్డడని ఫిర్యాధులో పేర్కోన్నారు. మరోవైపు గ్రామానికి నిధులు కేటాయించను ఏం చేసుకుంటావో చేసుకో అని హెచ్చరించాడని అన్నారు. కుల సంఘాల్లో తిరుగుతున్నావంటూ తిట్టారని తెలిపారు. దీంతో తమకు ఆయన నుండి ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదులో పేర్కోన్నారు. కాగా జరిగిన సంఘటన పై స్థానిక బీసీ సంఘాల నాయకులు గండ్ర వర్గం మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు