(D.Pranay,News18,warangal)
Alankar Tiffin Center: మీరెప్పుడైనా వరంగల్ వెళ్లితే అలంకార్ టిఫెన్‌సెంటర్‌కు వెళ్లడం మాత్రం మర్చిపోకండి. అదే యూసఫ్ బాబాయ్ ఇడ్లీ సెంటర్ అని వరంగల్‌లో ఎవ్వరినడిగా ఇట్టే చెప్పేస్తారు. ఇక్కడ అన్ని రకాల టిఫెన్(Tiffan)లు దొరకవండి. కేవలం ఇడ్లీ (Idli)మాత్రమే. వరంగల్(Warangal)లో ఇడ్లీ అంటే అలంకార్(Alankar)కు వెళ్లాల్సిందే అనేంతగా ఫేమస్. ముఖ్యంగా అక్కడ వేసే పల్లీచెట్నీ.. ఏమన్నా రుచిగా ఉంటుందా..అందులో వేసే నెయ్యి దాని టేస్ట్‌ను మరింత పెంచుతుంది. ఆహా ఏమి రుచి తినరా మైమరి అని పాడుకుంటారంటే నమ్మండి.
40ఏళ్లుగా బాబాయ్ హోటల్ పేరుతో ఫేమస్
చిన్న బండిపై 40 సంవత్సరాల క్రితం మొదలైన ఇడ్లి సెంటర్ నాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. తరాలు మారుతున్నా ప్రజలకు అదే రుచిని అందిస్తూ వాళ్ల నమ్మకాన్ని పొందుతున్నారు. తండ్రి చూపించిన మార్గాన్ని తన కొడుకులు నడుస్తున్నారు. 40 సంవత్సరాల క్రితం యూసఫ్ అనే వ్యక్తి ఒక ఇడ్లీ బండి మొదలుపెట్టాడు.. అది కాస్త ఈ రోజు వరంగల్ మహావృక్షంగా మారింది. యూసఫ్ బాబాయ్ ఇడ్లీ బండి అంటే వరంగల్‌లో తెలియని వారు ఎవరూ లేరు. అంత ఫేమస్ ఇడ్లీ బండి.
అలంకార్ టిఫెన్ సెంటర్..
అలంకార్ మెయిన్ రోడ్ లో ఈ ఇడ్లీ సెంటర్ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఇక్కడ ఇడ్లీలు అమ్ముతారు. ఇడ్లీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ఏంటి ఇంతకు ఏం స్పెషల్ అని ఆలోచిస్తున్నారా..
ఇడ్లీ సెంటర్ స్పెషాలిటీ..
ఈ ఇడ్లీ సెంటర్ సాదాసీదా ఇడ్లీ సెంటర్ కాదు.. ఇక్కడ ప్రతి ఐటమ్ వారు స్వయంగా వారి ఇంట్లో తయారు చేసింది. ఇడ్లీలో వేసుకునే చెట్నీ నుంచి నెయ్యి వరకు ప్రతిదీ వాళ్ల ఇంట్లోనే తయారుచేస్తారు. ఇక్కడ ఇడ్లీలో పల్లీ చట్నీ ఇస్తారు. దాంతో పాటుగా ఇంట్లోనే తయారు చేసిన కారప్పొడి.. అదేవిధంగా నెయ్యి వేస్తారు. అందుకే ఇక్కడ ఇడ్లీకి మరింత టేస్ట్. దీంతో ఈ ఇడ్లీ సెంటర్ కి కస్టమర్స్ క్యూలు కడుతుంటారు. ఉదయం ఈ సెంటర్ దగ్గర జనాలను చూస్తే ఏదైనా షాపింగ్‌మాల్ ఓపెనింగా అన్నట్లు ఉంటారు.
ఎవ్వరైనా లొట్టలేయాల్సిందే..!
చిన్న పెద్ద అంటూ తేడా లేదు ప్రతి ఒక్కరు అలంకార్ ఇడ్లీ తినాల్సిందే..ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ అక్కడికే వెళ్తారు. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్లు సైతం అక్కడ ఒక్కసారి రుచి చూస్తే..వాళ్ల అభిప్రాయం మార్చుకుని ఇడ్లీ లవర్స్‌లా మారిపోతారు.
పక్క జిల్లాల నుంచి కూడా వస్తుంటారు
అలంకార్ ఇడ్లి అంటే వరంగల్‌లో మాత్రమే ఫేమస్ కాదు.. పక్క జిల్లాల నుండి వచ్చే వాళ్ళు కూడా ముందుగా అలంకార్ ఇడ్లీ తిన్నాకే… వాళ్లు వచ్చిన పని చేసుకుంటారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఇడ్లీ సెంటర్ ఎంత ఫేమస్ అనేది. అనునిత్యం ఉద్యోగరీత్యా వెళ్లేవాళ్లు, చిరు వ్యాపారులు, ప్రత్యేకంగా ఇడ్లీ తినాలి అనుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఇడ్లీ సెంటర్ దగ్గర క్యూ కడతారు..
వేడివేడిగా కుక్కర్‌లో నుంచి మన ప్లేట్‌లోకే..!
మనం చాలా హోటల్ కి వెళుతూ ఉంటాం అయితే అక్కడ మనకు ప్లేట్ ఇడ్లీ ఇవ్వమంటే హాట్ బాక్స్‌లో నుండి తీసి మనకు ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాదు వేడి వేడి ఇడ్లీ నేరుగా ఇడ్లీ కుక్కర్ లో నుండి తీసి మనకు ఇస్తారు. ఇక్కడ ప్లేట్ ఇడ్లీ కాస్ట్ కేవలం ముప్పై రూపాయలు. 30 రూపాయలకు మూడు ఇడ్లీ తిన్నారంటే మధ్యాహ్నం వరకు ఆకలి, నీకు గుర్తుకు రాదు అంటున్నారు కొందరు కస్టమర్స్.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న కొడుకులు
యూసఫ్ బాబాయ్ మరణించిన తర్వాత తన కొడుకులు ఇడ్లీ బండి నడుపుతున్నారు. యూసఫ్ ఉన్నప్పటినుండి ఇప్పటివరకు ఇక్కడ ఇడ్లీలో టేస్ట్ ఏమాత్రం మారలేదు అంటున్నారు కస్టమర్స్.. అంత టేస్ట్ ఇడ్లీ మీరు కూడా తినాలి అనుకుంటున్నారా..అయితే అడ్రస్ తెలుసుకోండి.
అడ్రస్: అలంకార్ సెంటర్, హనుమకొండ వరంగల్, తెలంగాణ- -506001
ఫోన్ నెంబర్: 9490901497
ఎలా వెళ్లాలి..?
హనుమకొండ బస్టాండ్ నుండి వరంగల్ వెళ్తుండగా అలంకార్ జంక్షన్‌లో మీకు అలంకార్ ఇడ్లీ సెంటర్ అని చిన్న బండి పై ఇడ్లీ సెంటర్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా తినాలి అనుకుంటే ఇక్కడికి వెళ్లి ఒక్కసారి ఇడ్లీ టెస్ట్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Idli, Local News, Warangal