Santosh, News18, Warangal
వరంగల్ (Warangal) వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం (Warangal Preethi Case) కేసుకు సంబంధించి పోలీసులు విచారణ మమ్మరం చేశారు. ప్రీతి వాట్సప్ చాట్ ను రీట్రైవ్ చేశారు పోలీసులు. అంతేకాకుండా ప్రీతి గదిలో పలు కీలక ఆధారాలను కూడా సేకరించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసు సంబంధించి పోలీసులు విచారణ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థిని సైఫ్ దగ్గర నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి గదిని పోలీసులు పరిశీలించి ప్రీతి గదిలోని ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలో మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. మత్తుమందు మోతాదుపై ఆమె గూగుల్లో సెర్చ్ చేసినట్టు గుర్తించారు. గత కొంతకాలం నుంచి ప్రీతీని సైఫ్ వేధిస్తున్నట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రీతీని అవమానించే విధంగా వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. ప్రీతీ వాట్సప్ చాట్ ను రిట్రైవ్ చేశారు.
మెహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రీతి వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతుంది. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో బుధవారం ఉదయం 6:30 ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్ వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలిసింది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులకు సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర అవార్డుకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రీతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేసి నిందితుడు సైఫ్ ను రిమాండ్ చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attemp to suicide, Local News, Telangana, Warangal