రోజులు మారుతున్నా యువకుల్లో(Young boys) మార్పులు రావడం లేదు. వన్‌సైడ్ ప్రేమ (Love) తో యువతులను బలిచేస్తూ...తమను తాము శిక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమని ప్రేమించకపోతే ఎదుటి వ్యక్తులను దారుణంగా చంపివేయడం (Murder) మాములుగా మారిపోయింది. ప్రేమిస్తున్నామంటూనే యువతులను (Girls) కడతేర్చడం ఓకింత ప్రమాదంగా మారుతోంది. ఇలాంటి ఘటనే ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో జరిగింది. హన్మకొండలో (Hanmkonda)లో శుక్రవారం నాడు ఓ యువకుడు యువతి (Girl student)పై కత్తితో దాడికి (Attack with knife) దిగాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమించాలని యువతిపైఅజహర్ అనే యువకుడు కత్తితో శుక్రవారం దాడి చేశారు. హన్మకొండలోని పోచమ్మకుంటకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొంది. యువతిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రి (MGM Hospital)కి తరలించారు.
ఆమె ఒప్పుకోకపోవడంతో..
యువతి కాకతీయ యూనివర్శిటీ (Kakatiya University student)లో చదువుతున్నట్టుగా గుర్తించారు. నర్సంపేటకు సమీపంలోని లక్నంపల్లి గ్రామానికి చెందిన అనూష (Anusha) కాకతీయ యూనివర్శిటీలో చదువుతోంది. పోచమ్మకుంట సమీపంలో కుటుంబంతో పాటు అనూష నివాసం ఉంటుంది. కొంత కాలం నుండి అజహర్ అనూషను ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఇవాళ ఇంట్లో ఎవరూ లేరనే విషయం తెలుసుకొన్న అజహర్ (Azhar) యువతి ఇంట్లోకి వెళ్లి తనను ప్రేమించాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తన వెంట తెచ్చుకొన్న కత్తితో అనూష గొంతు కోశాడు. అనూష చనిపోయిందని భావించి అజహర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.
పోలీసుల అదుపులో నిందితుడు..?
ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు పేరేంట్స్ కు సమాచారం ఇచ్చారు. అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి.. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అనూషను చూసి షాక్‌కు గురైంది. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి (MGM Hospital) తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. యువతిపై దాడికి (Attack on girl) దిగిన నిందితుడు అజహర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
జగిత్యాలలో ఇలాంటి ఘటనే..
ఇటీవలె జగిత్యాలలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. జిల్లాలో జాబితాపూర్ గ్రామంలో ఓ యువకుడు (Young boy) తనను ప్రేమించడం లేదని, యువతిని కత్తితో పొడిచాడు. అనంతరం తాను కూడ అదే కత్తి (Knife)తో గొంతు కోసుకున్నాడు. సంఘటన జరిగిన తర్వాత స్థానిక ప్రజలు పోలీసులకు (Police) సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని హుటాహుటిన జగిత్యాల (Jagityal)జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా యువకుడు మేడిపల్లి మండలం మన్నెగూడెంకు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lover, Murder attempt, Warangal