Home /News /telangana /

WARANGAL A WIFE GAVE BIRTH TO A BABY BOY 11 MONTHS AFTER HER HUSBAND DEATH IN A DRAMATIC SITUATION IN WARANGAL PRV

Interesting story: భర్త చనిపోయిన 11 నెలలకు తల్లి అయిన భార్య.. ఏళ్ల కల సాకారం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

మంచిర్యాలకు చెందిన ఓ మహిళ తన భర్తను కోల్పోయింది. 11 నెలల క్రితం ఈ విషాద ఘటన జరిగింది. అయితే భర్త (34)ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ భార్య(32) వినూత్న పద్దతిలో తల్లి అయింది పండంటి బిడ్డకీ జన్మనిచ్చింది.

    కరోనా (Corona)  ప్రపంచాన్నే కుదిపేసింది. ఈ మాయదారి రోగం కారణంగా ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయారు. వేలాది మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారు. ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను కోల్పోయారు. ఇదే మాదిరిగా మంచిర్యాల కు(Mancherial) చెందిన ఓ మహిళ తన భర్తను కోల్పోయింది. 11 నెలల క్రితం ఈ విషాద ఘటన జరిగింది. అయితే భర్త (34)ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ భార్య (32) వినూత్న పద్దతిలో తల్లి అయింది పండంటి బిడ్డ (baby boy)కీ జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాలకు చెందిన దంపతులకు పెళ్లి అయి తొమ్మిదేళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదు. దీంతో వరంగల్​లోని (Warangal) ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్​ (Fertility Center)లో 2020 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఆ ఏడాది మార్చిలో అక్కడి వైద్యులు పరీక్షల నిమిత్తం భార్యభర్తల నుంచి అండం, Semen సేకరించి భద్రపరిచారు.

    కాటేసిన కరోనా..

    భార్య (wife) నుంచి అండం, భర్త నుంచి వీర్యకణాలు సేకరించి ఫ్రీజింగ్‌ చేశారు ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు . అయిదు రోజుల తర్వాత పిండం ఏర్పడింది. ఇన్నేళ్లకు తమ కలలు పండబోతున్నాయని ఆ దంపతులు (Couple) మురిసిపోతున్న సమయంలో వారి కలలను కరోనా ఛిద్రం చేసింది . ఇరువురు దంపతులకు కొవిడ్‌ సోకింది. చికిత్స పొందుతూ భర్త మృత్యువాత పడ్డాడు. గత ఏడాది మే నెలలో ఈ ఘటన జరిగింది.

    వైద్యులు నిరాకరించడంతో..

    పిల్లలు కావాలన్న కోరిక తీరకుండానే జీవిత భాగస్వామి మరణించడంతో 32 ఏళ్ల ఆ భార్య కుంగిపోయింది. మరో పెళ్లి చేసుకోకుండా అత్తమామలతో కలిసి ఉంటుంది. ఆస్పత్రిలో భద్రపరిచిన భర్త వీర్యం ద్వారా బిడ్డను కని మాతృత్వపు మాధుర్యం చవిచూడాలని భావించింది. ఫ్రీజర్‌లో ఉన్న పిండాన్ని మోయాలని ఆమె గట్టి నిర్ణయానికొచ్చింది. అదే విషయాన్ని అత్తమామలకు వివరించింది. వారు అంగీకరించడంతో వైద్య నిపుణులను సంప్రదించింది. ఐవీఎఫ్‌ (IVF) ద్వారా గర్భం (pregnancy) ధరించడానికి దంపతులు ఇరువురూ సంతకాలు చేయాలని, భర్త మరణించాడు కాబట్టి ఇది కుదరదని తేల్చేశారు. అయితే, న్యాయపరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా హైకోర్టుకు వెళ్ళింది.

    కోర్టు సైతం ఆ భార్య ఇష్టానికి వదిలివేయడంతో దంపతుల నుంచి సేకరించి భద్రపరిచిన వీర్యం ద్వారా ఆగస్టు 2021లో ఆసుపత్రి నిపుణులు ఐవీఎఫ్ చికిత్స ప్రారంభించారు. ఇది సఫలం కావడంతో ఈ ఏడాది మార్చి 22న పండంటి మగబిడ్డకు మహిళ జన్మనిచ్చింది.  16 రోజుల బాబును చూపిస్తూ తల్లి కావాలని ఆ స్త్రీ పడిన తపన, ఆమెకు అండగా నిలిచిన అత్తమామల గొప్పదనాన్ని ఆసుపత్రి సిబ్బంది ప్రశంసించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona, Covid, Pregnancy, Warangal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు