హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఘోరం..శవాన్ని 36 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రైన్..ఆ తరువాత ఏం జరిగిందంటే?

ఘోరం..శవాన్ని 36 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రైన్..ఆ తరువాత ఏం జరిగిందంటే?

ఘోరం..అసలేం జరిగిందంటే?

ఘోరం..అసలేం జరిగిందంటే?

కొన్ని కొన్ని ఘటనలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇక యాక్సిడెంట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ప్రమాదం తరువాత వారి బాడీ గుర్తు పట్టలేని స్థితిలో ఉంటుంది. ఇక ఘోర ప్రమాదం అయితే వారి శరీరం తునా తునకలు అవుతుంది. ఇక ప్రమాదం జరిగిన తరువాత శవాన్ని ఈడ్చుకెళ్ళిన ఘటనలు ఉన్నాయి. ప్రమాదం తరువాత దొరికిపోతాననే భయంతో కొంతమంది వాహనాన్ని ఆపకుండా వెళ్తారు. మరికొంతమంది ప్రమాదం జరిగిన విషయం కూడా చూసుకోకుండా అలాగే వెళ్లిన ఘటనలు ఉన్నాయి. ఇక తాజాగా జరిగిన ఘటన చూసిన, విన్న రోమాలు నిక్కబొడవడం ఖాయం. ఇంతకంటే ఘోరమైన ఘటన ఉంటుందా అని అనిపించేలా జరిగిందీ ఘటన. దీనికి సంబంధించి పూర్తి వివరాలున్నాయి. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కొన్ని కొన్ని ఘటనలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇక యాక్సిడెంట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ప్రమాదం తరువాత వారి బాడీ రక్తపు మరకలతో నిండిపోతుంది. ఇక ఘోర ప్రమాదం అయితే వారి శరీరం తునా తునకలు అవుతుంది. ఇక యాక్సిడెంట్ జరిగిన తరువాత శవాన్ని ఈడ్చుకెళ్ళిన ఘటనలు ఉన్నాయి. ప్రమాదం తరువాత దొరికిపోతాననే భయంతో కొంతమంది వాహనాన్ని ఆపకుండా వెళ్తారు. మరికొంతమంది ప్రమాదం జరిగిన విషయం కూడా చూసుకోకుండా అలాగే వెళ్లిన ఘటనలు ఉన్నాయి. ఇక తాజాగా జరిగిన ఘటన చూసిన, విన్న రోమాలు నిక్కబొడవడం ఖాయం. ఇంతకంటే ఘోరమైన ఘటన ఉంటుందా అని అనిపించేలా జరిగిందీ ఘటన. దీనికి సంబంధించి పూర్తి వివరాలున్నాయి.

కన్నీళ్లు పెట్టిస్తున్న కవల పిల్లల కథ..ఇంతటి కష్టం ఎవరికీ రాకూడదు!

తెలంగాణలోని హన్మకొండ జిల్లా నయిం నగర్ కు చెందిన గద్వాల ఉప్పలయ్య వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య డిపార్ట్ మెంట్ లో జావాన్ గా పని చేసి ఇటీవల రిటైర్ అయ్యాడు. ఆ తరువాత ఉప్పలయ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రోజు కాజీపేట రైల్వే స్టేషన్ సమీపానికి వచ్చిన ఉప్పలయ్య చెన్నై-లక్నో అండమాన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని గమనించని లోకో పైలట్ అలాగే ఆ శవాన్ని 36 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మరో లోకో పైలట్ శవాన్ని గమనించి జమ్మికుంట రైల్వే స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. దీనితో జమ్మికుంటలో ట్రైన్ ఆపేశారు.

Q Fever: హైదరాబాద్‌లో క్యూ ఫీవర్ టెన్షన్... వారిని సిటీ నుంచి వెళ్లాలన్న అధికారులు..!

ఉప్పలయ్య మృతదేహాన్ని 36 కిలోమీటర్లు ఈడ్చుకురావడంతో ఇంజన్ ముందుభాగంలో శవం ఇరుక్కుపోయింది. దీనితో బాడీని బయటకు తీయడానికి 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి చివరకు గడ్డపార సాయంతో శవం ఇరుకున్న భాగాన్ని తొలగించి బయటకు తీశారు. ఇక ఉప్పలయ్య దగ్గర సూసైడ్ నోట్ సహా ఆధార్ కూడా లభించింది. ఆ సూసైడ్ నోట్ లో తన చావుకు ఎవరు కారణం కాదని పేర్కొన్నాడు. ఆధార్ లో వివరాల ఆధారంగా పోలీసులు ఉప్పలయ్య కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఉప్పలయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆత్మహత్యకు అదే కారణం కావొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. అయితే ఉప్పలయ్య నిజంగానే ఆత్మహత్యా చేసుకున్నాడా లేక ఎవరైనా చంపేసి ఉంటారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇంతటి దారుణ పరిస్థితి పరాయి వాళ్లకు కూడా రాకూడదని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

First published:

Tags: Crime, Crime news, Telangana, Warangal

ఉత్తమ కథలు