తెలంగాణ (Telangana)ను మరోసారి భారీ వర్ష సూచన భయపెడుతోంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత మూడ్రోజులుగా అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిశాయి. వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చాడని ఊపిరిపీల్చుకునేలోపే వెదర్ అప్డేట్ ప్రజల్లో కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. వర్షాలు, వరదలతో బురదలోంచి జనం బయటపడక ముందే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తునే ఉన్నాయి. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ భారీ వర్షాల రూపంలో విరుచుకుపడటంతో సాగు పనులు మొదలుపెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తొర్రూరులోని ఓ స్కూల్‌కి చెందిన బస్సు (School bus) 16 మంది విద్యార్ధులతో వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. వరద (Floods) నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బస్సు మధ్యలోనే ఆగిపోయింది. అయితే వెంటనే స్పందించిన స్థానికులు 16 మంది పిల్లలను సురక్షితంగా రక్షించి వారి ఇళ్లకు తరలించారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఇక జిల్లాలోని నెల్లికుదురు మండలంలో భారీ వర్షం కురుస్తోంది. మండలంలోని రావిరాల గ్రామం వద్ద ఉన్న లెవల్ రోడ్డు వంతెనపై వరద పోటెత్తడంతో ఊరికి రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లడానికి ఆ ఊరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Nagarkurnool: లంబాడీ మహిళల వస్త్రధారణ వెనుక ఇంత ఉందా? ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..
కాగా, నేడు, రేపు హైదరాబాద్ (Hyderabad) నగరానికి భారీ వర్ష (Heavy rains)సూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) వాహనదారులకు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్ల మీదికి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్ల మీదికి రాకుండా గంట తరువాత రావాలని సూచించారు.
భారీ వర్షాలతో నగరంలోని రోడ్ మీదికి చేరిన నీరు బైటికి వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాధికారులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heavy Rains, Mahabubabad, School