ఐసీయూ ఉన్న రోగిని బాగానే ఉన్నాడంటూ డిశ్చార్జ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి పంపేశారు. అయితే ఆపరేషన్ చేసినప్పుడు పుర్రె పైభాగాన్ని తీసేసిన ప్రైవేటు డాక్టర్లు తిరిగి అతికించలేదు.
ఐసీయూ (ICU) ఉన్న రోగిని బాగానే ఉన్నాడంటూ డిశ్చార్జ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి పంపేశారు. అయితే ఆపరేషన్ చేసినప్పుడు పుర్రె పైభాగాన్ని తీసేసిన ప్రైవేటు డాక్టర్లు తిరిగి అతికించలేదు. ఈ దారుణమైన సంఘటన వరంగల్‌లోని (Warangal) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరోగ్య శ్రీ సిబ్బందిపై కూడా పాలుపంచుకోవడం మరీ దారుణం. వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో బాధితుడి బంధువులువరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయితే న్యూరో సమస్యతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్‌కు ఆసుపత్రి వైద్యులు తల పైభాగం వేరు చేసి శస్త్రచికిత్స (removed the top of patient skull in operation )చేశారు. ఇందులో భాగంగా ఆపరేషన్ కోసం పుర్రె పైభాగం వేరు చేశారు (Warangal Head Surgery) వైద్యులు.
ఆరు రోజులే ట్రీట్మెంట్ చేస్తారని..
పేషెంట్ తల పుర్రె పైభాగం (The top of the skull) వేరు చేయగా పరిస్థితి విషమంగా మారింది. దీంతో పేషంట్‌ను డిశ్చార్జి చేయాలనుకున్నారు ఆసుపత్రి సిబ్బంది. ఆరోగ్యశ్రీ సిబ్బంది సాయంతో డిశ్చార్జి రిపోర్ట్ తయారు చేశారు ఆసుపత్రి సిబ్బంది. ఇక ఆరోగ్యశ్రీలో కేవలం 6 రోజులే ట్రీట్మెంట్ చేస్తారని తర్వాత ట్రీట్ మెంట్ చేయాలంటే రోజుకు లక్ష రూపాయల వరకు ఖర్చవుతుందని అందుకు సిద్ధమైతేనే ఆసుపత్రిలో ఉంచాలని పేషెంట్ బంధువులకు కబురు పంపారు. లేదంటే ఎంజీఎంకు తరలించాలని చివరలో రోగి బంధువులకు చెప్పారు.
ఐసీయూలోనే ఫోటోలు..
ఇక రిపోర్టు కూడా తప్పుల తడకగా ఉండటం మరీ దారుణం. ఈ నెల 18న ఆసుపత్రిలో చేరినట్లు ఉంది. కానీ, 15న ఆపరేషన్ చేసినట్టు రిపోర్టులు తయారు చేశారు. ఈనెల 20న పేషెంట్ కండీషన్ స్టేబుల్‌గా ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. ఆరోగ్య శ్రీ సిబ్బంది కూడా పేషెంట్ కండీషన్ పట్టించుకోకుండా డిశ్చార్జి చేస్తున్నట్టు ఐసీయూలో ఫోటోలు దిగడం మరీ దారుణం. అంతేకాదుప్రైవేటు హాస్పిటల్ ఒకలా ఆరోగ్యశ్రీ సిబ్బంది మరోలా వివరాలు నమోదు చేశారు. దీనిపై ప్రశ్నిస్తే అప్పుడు ప్రైవేటు ఆసుపత్రి 15న ఆసుపత్రిలో చేరినట్టు 20న డిశ్చార్జ్ అయినట్టుగా రిపోర్టు మార్చారు.
రోగి బంధువులు ఆగ్రహం..
అనంతరం పేషంట్‌ను బంధువులు ఎంజీఎంకి తరలించారు. అయితే శస్త్ర చికిత్స (Warangal Head Surgery) సమయంలో వేరు చేసిన పుర్రె పైభాగం ప్రైవేటు ఆసుపత్రిలోనే ఉండిపోవడంతో కలకలం రేగింది. ఈ ఘటనపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్ పరిస్థితిపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. పేషంట్ మల్లేశ్‌ను అపస్మారక స్థితిలో హాస్పిటల్ కు తీసుకొచ్చారని తెలిపారు. ప్రస్తుతం వెంటలేటర్ పైనే మల్లేశ్‌కు చికిత్స జరుగుతోందని ఆయన అన్నారు. పేషంట్ కండీషన్ విషమంగానే ఉందన్నారు.
ఎలాంటి తప్పు జరగలేదు..
సదరు ప్రైవేటు హాస్పిటల్ చైర్మన్ పోల నటరాజ్ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీలో, హాస్పిటల్ రికార్డులో తప్పులు దొర్లటానికి టైపింగ్ మిస్టేక్ కారణమని అన్నారు. మానవతా దృక్పథంతోనే ఆపరేషన్ చేశామని ఆయన వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు నటరాజ్. వెంటిలేటర్‌పై ఉన్న రోగిని బంధువుల కోరిక మేరకే ఎంజీఎంకు తరలించారని ఆయన చెప్పారు. క్లరికల్ మిస్టేక్స్ మాత్రమే జరిగాయని ఎలాంటి అవకతవకలు లేవని నటరాజ్ స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.