WARANGAL A PLATE MEAL AT A HOTEL IN WARANGAL COSTS JUST RS 50 AND AN ADDITIONAL RS 50 IF FOOD IS LEFT OVER FULL DETAILS HERE WPD NJ PRV
Warangal Hotel: ఆ హోటల్ రూటే సపరేటు.. తింటే రూ.50, తినకపోతే మరో రూ. 50..! వివరాలివే..
లింగాల కేదారి ఫుడ్ కోర్ట్ స్పెషల్ స్టోరీ
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నాన్ని ఎంతోమంది వేస్ట్ చేస్తుంటారు. ప్రతి అన్నం మెతుకు ఎవరో ఒకరి ఆకలి తీరుస్తుంది కదా అనే ఆలోచనతో మొదలైన ప్రయాణం.. నేడు ఎంతో మందికి ఆదర్శంగా మారింది. ఇంతకీ ఏమిటా ఆలోచన తెలియాలంటే లింగాల కేదారి కెళ్లాల్సిందే…!
Lingala Kedari Food court: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని వ్యాపారంగా చేసి అమ్ముతున్నారు. మనం ఏ హోటల్ కి వెళ్ళినా ఏం తింటారు అని అడుగుతారు. కానీ మనం తిన్న తినకపోయినా మనల్ని వాళ్ళు ప్రశ్నించారు…కానీ వరంగల్‌లోని (Warangal) ఒక హోటల్‌లో మాత్రం కొంచెం డిఫరెంట్. ఇక్కడ మనం ఏదైనా తినొచ్చు ఎంతైనా తినొచ్చు కానీ ఏది వదిలిపెట్టకుండా తినాలి… లేకుంటే యాభై రూపాయల ఫైన్.
ఆ హోటల్ రూటే సపరేట్
అదేంటి తినడానికి డబ్బులు కడతాం తినక పోయినా డబ్బులు కట్టాలా ఇదేంటి తేడాగా ఉంది అని అనుకుంటున్నారా అవును ఇది కొంచెం డిఫరెంట్ ఈ హోటల్ రూటే సపరేటు.. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు …అన్నం విలువ తెలియని ఎంతో మంది ఆహారాన్ని వృధా చేస్తూ ఉంటారు. నిత్యం మనం ఆహారం కోసం అలమటించేవాళ్లను, దేహీ అని అడిగే వాళ్లను చూస్తూ ఉంటాం.. అలాంటి వారికి మనం సహాయం చేస్తాం లేదా వారికి కొంచెం ఆహారం పెట్టిస్తాం.
ఆకలి అన్న వారికి అన్నం
ఈ దంపతులు దాదాపు గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది నిరుపేదలకు అన్నం పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉచిత భోజనం పెట్టారు. ఆకలి అన్నవారికి ఇప్పటికి కూడా ఎంతో మందికి అన్నం పెడుతూ ఉన్నారు. ఆ దంపతులు ఇంతకీ వారు ఎవరు భారీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అన్నం పెట్టాలి ఉన్నటువంటి ఆలోచన వారిలో ఎలా మొదలైంది?
ఫుడ్ కోర్ట్ ఎలా మొదలైంది?
లింగాల కేదారి ఫుడ్ కోర్ట్ (Lingala Kedari Food court) …. వరంగల్‌లో ఈ పేరు తెలియని వారు లేరు. ఈ హోటల్‌లో ఫుడ్ రుచి చూడని వారు లేరు. అంత పేరున్న ఫుడ్ కోర్ట్ ఇది. లింగాల కేదారి 30 సంవత్సరాల క్రితం చిన్న మిర్చి బండి తో మొదలైన తన వ్యాపారం ఈ రోజు పేరున్న ఫుడ్ కోర్ట్ గా మారింది. అన్నం విలువ తెలిసిన లింగాల కేదారి అన్నం వృధా చేయకూడదని… అలా వృధా చేసే అన్నం ఇంకొకరికి ఉపయోగపడుతుందని నటువంటి ఆలోచనతో ఫుడ్ కోర్ట్‌ను ప్రారంభించాడు. ఈ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు దంపతులు ఇద్దరూ కూడా స్వయంగా వంట చేసి కస్టమర్లకు పెట్టేవారు..
ఈ ఫుడ్ కోర్టులో ఏదైనా తినొచ్చు కూరగాయ భోజనాలతో మొదలుపెడితే మాంసాహారాలు వరకు ప్రతిదీ ఇక్కడ లభిస్తుంది. మనం ఏదైనా తినొచ్చు కేవలం 50 రూపాయలు మాత్రమే. తినక పోతే మరో యాభై అదనంగా చెల్లించాలి. మనం ఈ హోటల్‌లోకి ఎంటర్ కాగానే మన దగ్గర నుండి వంద రూపాయలు తీసుకుంటారు. భోజనం అయిపోయాక మనం తిన్న ప్లేట్ వారికి చూపిస్తే తిరిగి మనకు 50 రూపాయలు ఇస్తారు. మనం తిన్న ప్లేట్లు ఏమైనా మిగిలితే ఆ 50 రూపాయలు తీసుకుంటారు.
స్వచ్ఛంద సంస్థలకు ఆ డబ్బులు..!
అలా తీసుకున్న 50 రూపాయలు భారీ వ్యాపారానికి ఉపయోగించుకోకుండా పేద వారికి సహాయం చేయాలి అన్న టువంటి ఆలోచనతో పలు స్వచ్ఛంద సంస్థలకు ఆ డబ్బుల్ని పంపిస్తూ ఉంటారు లింగాల కేదారి. సమాజంలో అన్నం విలువ తెలియాలి ఉన్నటువంటి మార్పు అందరిలో రావాలి అన్నటువంటి స్వయంకృషితో ఇప్పటికీ ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు..
హోటల్‌లో ఫుడ్ రేట్లు..
అయితే ఈ మధ్య కాలంలో పెరిగిన ధరలతో కొంతమేరకు ధరలు పెంచారు. గతంలో 50 తీసుకున్నారు ఈ మధ్యకాలంలో కూరగాయల ధరలు, మాంసం ధరలు పెరగడంతో ప్లేట్ మీల్స్ ₹100 చేశారు. పెనాల్టీ మాత్రం 50 రూపాయలు కొనసాగుతుంది. క్యాటరింగ్ సర్వీస్ కూడా ప్రారంభించారు.
ఈ లింగాల కేదారి ఫుడ్ కోర్టు కాంటాక్ట్‌నెంబర్:
+91 98493 14830
+91 9394513399
ఎలా వెళ్లాలి?
ఒకవేళ మీరు కూడా లింగాల కేదారి ఫుడ్ కోర్ట్ కి వెళ్లి తినాలి అనుకుంటే హనుమకొండ డిస్ట్రిక్ట్ కోర్ట్ పక్కనే ఈ హోటల్ ఉంటుంది లేదా హనుమకొండ సర్కిల్ అంటే ఎవరైనా చెప్తారు మీరు కూడా వెళ్లి ఒకసారి లింగాల కేదారి ఫుడ్ కోర్ట్ ఫుడ్ తిని చూడండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.