హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal MGM: వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిలో కలకలం.. ఐసీయూలో పేషెంట్​పై ఎలుకల దాడి.. తీవ్ర రక్త స్రావం.. వైద్య శాఖ మంత్రి హరీశ్​ రావు సీరియస్​.. 

Warangal MGM: వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిలో కలకలం.. ఐసీయూలో పేషెంట్​పై ఎలుకల దాడి.. తీవ్ర రక్త స్రావం.. వైద్య శాఖ మంత్రి హరీశ్​ రావు సీరియస్​.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వరంగల్ (Warangal) జిల్లా కేంద్రంలోని ఎంజీఎం (MGM) ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐసీయూ (ICU)లో ఓ రోగిని ఎలుకలు  దాడి చేయడం (rats Attack) కలకలం సృష్టించింది.

వరంగల్ (Warangal) జిల్లా కేంద్రంలోని ఎంజీఎం (MGM) ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐసీయూ (ICU)లో ఓ రోగిని ఎలుకలు  దాడి చేయడం (rats Attack) కలకలం సృష్టించింది. పేషెంట్ కాలు, చేతుల వేళ్లను ఎలుకలు (Rats) కొరికేశాయి. ఎలుకల దాడిలో గాయపడిన వ్యక్తిని శ్రీనివాస్‌గా గుర్తించారు. శ్రీనివాస్ నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎం (Warangal MGM)లో చేరారు. అతడికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే శ్రీనివాస్‌పై కాలు, చేతులను ఎలుకలు కొరకడంతో.. తీవ్ర రక్తస్త్రావం అయింది. దీంతో శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళనలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి (Warangal MGM) సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసీయూలో ఉన్న పేషెంట్ (Patient) పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితేమిటీ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అడిషనల్​ కలెక్టర్​ విచారణ..

అయితే ఆసుపత్రి (Warangal MGM) నిర్వాకంపై మీడియాలో కథనాలు రావడంతో అధికారులు అలర్ట్​ అయ్యారు. వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీవాస్తవ (Additional Collector Srivastava) ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి రోగి బంధువులతో చర్చించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఆసుపత్రిలో విధుల్లో అందరూ ఉన్నారా , ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే విషయమై కూడా  అడిషనల్క లెక్టర్​ ఆరా తీశారు. ఐసీయూలోకి ఎలుకలు ఎలా వచ్చాయనే విషయమై కూడా అడిషనల్ కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండ్ ను శ్రీవాస్తవ ప్రశ్నించారు. ఆసుపత్రిలో శానిటేషన్ పనులు (Sanitation works) సరిగా చేయకపోవడం వల్లే ఎలుకలు వ్యాప్తి చెందుతున్నాయని కూడా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

మంత్రి హరీశ్​ రావు సీరియస్​..

అయితే ఎంజీఎం(Warangal MGM) ఆసుపత్రిలో ని ICUలో Srinivas అనే రోగి కాలు, చేతిని ఎలుకలు కొరికిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ విషయమై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు  (Minister Harish Rao) విచారణకు ఆదేశిస్తున్నట్టుగా గురువారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకొంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కావొద్దని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) వైద్య, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు.  గతంలో వరంగల్ ఎంజీఎం (Warangal MGM) ఆసుపత్రిలో ఒక్క రోజు పసికందును కుక్కలు కరిచి చంపాయి. ఈ ఘటన 2011 జనవరి 12న చోటు చేసుకొంది. 2018లో మృత శిశువును ఎలుకలు కొరికిన ఘటనలు కూడా చోటు చేసుకొన్నాయి.

First published:

Tags: Hospitals, Minister harishrao, Rats, Warangal

ఉత్తమ కథలు