హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: వరంగల్‌లో కదిలే ఇల్లు.. భార్యకి బహుమతిచ్చిన భర్త

Warangal: వరంగల్‌లో కదిలే ఇల్లు.. భార్యకి బహుమతిచ్చిన భర్త

X
కదిలే

కదిలే ఇల్లు

Warangal: సామాన్యంగా మనం బజారుకి వెళితే ఏమైనా బొమ్మలు, కూరగాయలు, పళ్ళు లేక ఏవైనా వస్తువులు కొనుక్కుంటాం కానీ ఓ వ్యక్తి తన సతీమణి కోసం ఏకంగా ఓ ఇంటిని కొని తన భార్యకి బహుమతిగా ఇచ్చాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Santosh, News18, Warangal.

సామాన్యంగా మనం బజారుకి వెళితే ఏమైనా బొమ్మలు, కూరగాయలు, పళ్ళు లేక ఏవైనా వస్తువులు కొనుక్కుంటాం కానీ ఓ వ్యక్తి తన సతీమణి కోసం ఏకంగా ఓ ఇంటిని కొని తన భార్యకి బహుమతిగా ఇచ్చాడు. మరి ఇల్లు అంటే బొమ్మలు అనుకోవద్దు నిజంగా ఇల్లే.. అది కూడా మనం ఎక్కడకి కావాలంటే అక్కడకి తీసుకెళ్లే ఇల్లు బహుమతి ఇచ్చాడు.

ఒక చోట నుండి తరలించే ఈ మొబైల్ ఇల్లు సుమారు 25 ఏళ్ల పాటు ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. ధర కూడా తక్కువ ఉండడంతో సామాన్యులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సామాన్యంగా ఒక ఇల్లు కట్టాలంటే సిమెంట్, ఇసుక, ఐరన్ కావాలి కానీ ఇంటికి మాత్రం ఇవేవి అవసరంలేదు. కేవలం ఐరన్ ప్లైవుడ్ తో నిర్మిస్తారు. మాములుగా కట్టుకునే ఇళ్లతో పోలిస్తే ఎక్కడా తగ్గకుండా ఉంటుంది ఈ ఇల్లు. ఈ ఇంటిని నిర్మించడానికి సుమారు 4.5 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.

హనుమకొండ జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లికి చెందిన గొల్లపెల్లి సతీష్ గౌడ్ వృత్తిరీత్యా ప్రైవేట్ ఉద్యోగి కాగా తన భార్య సుహాసిని చేతి కుట్టు పనులు చేస్తారు. ఐతే తన భార్య కోసం ఒక షాప్ కిరాయి కోసం వడ్ఢేపెల్లిలో పలు చోట్ల అద్దెకి వెతుకుతారు. అయితే, ఒక చోట అద్దె ఎక్కువగా ఉంటుంది మరొక చోట సరైన సదుపాయాలు ఉండవు. దీనితో చాలా వెతికి విసికిపోయి తన భర్య సలహా మేరకు కొత్త తరహా ఇల్లు నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

Mobile Numerology: మీ మొబైల్ నంబర్ 2నా? అయితే, మీ జీవితాన్ని ఇలా మార్చుకోండి!

అనంతరం హైదరాబాద్ కు వెళ్లి మొబైల్ హౌస్ నిర్మించే వారి వద్ద వారికి కావలసిన డిజైన్ ని ఎంచుకున్నారు. అనంతరం వడ్డేపల్లిలో ఉన్న వారి ఇంటివద్దరెడీ మేడ్ ఇంటిని అమర్చారు. ఇలా కొత్త రకమైన తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించుకోవాలని అందరికి ఉంటుంది. ఐతే కేవలం ఎనిమిది లక్షల రూలతో ఇల్లు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు. ఇలాంటి ఇంట్లో ఉండటం కూడా చాలా థ్రిల్లింగ్ ఉందంటున్నారు సతీష్. ఇన్ని లక్షలరూపాయలు పెట్టి తన కోసం రెడీ మేడ్ ఇల్లు తీసుకురావడం సంతోషంగా ఉందని.. ప్రతి ఒక్కరు దీనిని చూసి వీరి కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారని సంతోషాన్ని వ్యక్తం చేసింది సతీష్ భార్య సుహాసిని.

First published:

Tags: Local News, Telangana, Warangal