హోమ్ /వార్తలు /తెలంగాణ /

WARANGAL: హిమాలయాల్లో మాత్రమే కనిపించే అద్భుతం.. వరంగల్‌లో ప్రత్యక్షం

WARANGAL: హిమాలయాల్లో మాత్రమే కనిపించే అద్భుతం.. వరంగల్‌లో ప్రత్యక్షం

X
వరంగల్

వరంగల్ విరిసిన అరుదైన పుష్పం

Warangal: బ్రహ్మ కమలం.. ఇది కేవలం హిమాలయ పర్వతాల్లో.. తరచూ మంచు కురిసే ప్రదేశంలో వికసించే పుష్పం. ఈ అద్భుతమైన కమలం బ్రహ్మ కమలం. ఈ కమలం ఉత్తర్ ప్రదేశ్, నేపాల్, డిబేట్లో మాత్రమే కనిపిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Santosh, News18, Warangal.

బ్రహ్మ కమలం.. ఇది కేవలం హిమాలయ పర్వతాల్లో.. తరచూ మంచు కురిసే ప్రదేశంలో వికసించే పుష్పం. ఈ అద్భుతమైన కమలం బ్రహ్మ కమలం. ఈ కమలం ఉత్తర్ ప్రదేశ్, నేపాల్, డిబేట్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ పుష్పానికి ఎన్నో ఔషధ గుణాలు కలవని చెప్పుకుంటారు. ఈ కమలం యొక్క ప్రత్యేకతలు ఆకులో నుంచి పువ్వు వస్తుంది. పార్వతీదేవి కోరిక మేరకు బ్రహ్మ ఈ కమలాన్ని సృష్టించినట్టు పురాణాల్లో చెప్పుకుంటారు ఈ పుష్పాన్ని చూసి ఎప్పుడైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందని నమ్మకం. ఇంతటి అద్భుతమైన పుష్పాన్ని ప్రతి ఒక్కరు దర్శించాలి.

వరంగల్ కేంద్రంలోని గోపాల్ స్వామి గుడి మట్టవాడ ప్రాంతంలో ఈ అద్భుతమైన బ్రహ్మ కమలం దర్శనమిచ్చింది. గత ఐదు సంవత్సరాల క్రితం పెట్టిన ఈ బ్రహ్మ కమలం మొక్క వికసించడం అద్భుతం. 20 సంవత్సరాలైనా పూయని పుష్పం కేవలం ఐదు సంవత్సరాలకు వికసించడం అదృష్టంగా భావిస్తున్నారు.

కార్తీక మాసం సోమవారం నాడు పూయడంతో ఈ పుష్పానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంతటి విశిష్టత కలిగిన పుష్పం పూయడంతో సంతోషిస్తున్నారు. సూర్యరశ్మి తగలకుండా నిష్టతో చూసుకుంటే ఈ పుష్పం పూస్తుంది.

Shani Effect: వచ్చే ఏడాది ఈ రాశుల వారు ధనవంతులవుతారు.. శని ఆశీస్సులతో అన్నీ శుభాలే

ఈ కమలానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఉత్తరకాండ రాష్ట్ర పుష్పంగా భావిస్తారు. ఈ పుష్పం సుమారు మూడు గంటల పాటు సాయంత్రం మాత్రమే వికసిస్తుంది. మరల మూడు గంటల్లో చిన్న పోతుంది. కమలం వికసించే సమయంలో ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం లాంటి సువాసన విభజిల్లుతుంది. ఆ సుగందాన్ని పీల్చడం ద్వారా సర్వ రోగాలు నయం అవుతాయని, ఏదో పుణ్యం చేసుకుంటేనే తమ ఇంట్లో ఈ బ్రహ్మ కమలం పూసిందని ఈ మొక్క యజమాని గోరంట్ల మనోహర్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

First published:

Tags: Local News, Telangana, Warangal