Waranagal : ప్రియుడు ఇచ్చిన డబ్బుతోనే వాడిని కిడ్నాప్ చేయించింది. ఆ తర్వాత బెదిరించి ఆస్థిని రాయించుకోవాలని చూసింది. అయితే పోలీసులు వెంటపడడంతో హడావిడిగా ప్రియుడితో తాళి కట్టించుకుంది.
ఇద్దరు పిల్లలు ఉన్నా.. మరోకరి వెంటపడింది.. భర్తను వదిలేసి ప్రియుడి కోసం స్కెచ్ వేసింది. అయితే ఆ ప్రియుడికి కూడా పెళ్లి కావడంతో మరోపెళ్లికి నిరాకరించాడు. అయితే ఆ ప్రియురాలు మాత్రం ఊరుకోలేదు.. భయపెట్టి తన దారికి తెచ్చుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టింది. కాని పెద్దమనుషులు కూడా డబ్బుతో సరిపెట్టారు. కాని ప్రియుడి వల్ల తన భర్త వదలి పారి పోయాడని అందుకే తనను పెళ్లి చేసుకోవాలని భీష్మీంచుకు కూర్చుంది. ఈ క్రమంలోనే ప్రియుడి ఇచ్చిన డబ్బుతోనే స్కెచ్ వేసింది. ఎలాగైనా పెళ్లి చేసుకుని ఆస్థికి వారసులు కావాలని నిర్ణయించింది. దీంతో ప్రియుడు ఇచ్చిన డబ్బుతోనే సుఫారీ గ్యాంగ్‌ను మాట్లాడింది. కిడ్నాప్ చేయించి హడావిడిగా దండలు మార్చుకుని పెళ్లి చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... నర్సంపేట శివారులోని కమలాపురానికి చెందిన ముత్యం శ్రీను, నర్సంపేటలో మద్యం షాపు నిర్వహిస్తుండడంతో పాటు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఇక అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు కొంత అప్పుగా ఇచ్చాడు. వసూలు కోసం తరచూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి ఆ మహిళ భర్త ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. అయితే.. శ్రీను వల్లే తన కాపురం దెబ్బతిన్నదంటూ ప్రియుడిని ఆమె నిలదీసింది. 2 నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. అయితే శ్రీనుకు కూడా పెళ్లి కావడంతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో పెద్ద మనుషులు నష్టపరిహారాన్ని ఆఫర్ చేశారు. అందుకు పరిహారంగా గతంలో ఇచ్చిన అప్పును మాఫీ చేసి మహిళకు శ్రీను అదనంగా రూ.1.5 లక్షలు ఇవ్వాలని తీర్మానం చేశారు.
అయితే పెద్ద మనుషుల తీర్మాణం ఆమెకు నచ్చలేదు.. భర్త తన నుండి వెళ్లిపోవడంతో పాటు తాను ఆశించినట్టుగా ఆస్థి కూడా దక్కలేదని కుట్ర పన్నిది.. దీంతో.. ప్రియుడినే పెళ్లి చేసుకొని, అతని ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్ వేసింది. దీంతో శ్రీను కిడ్నాప్‌కు పన్నాగం వేసింది. ఇందుకోసం ఓ సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది..
ఈ క్రమంలోనే బుధవారం పట్టణ శివారులో సుఫారీ గ్యాంగ్ సభ్యులతో కలిసి శ్రీనును బలవంతంగా కారులో ఎక్కించుకొని పాకాల వైపు వెళ్లింది. స్థానికులు శ్రీను కుటుంబ సభ్యులకు తెలపడంతో బాధితుడి కుమారుడు భరత్ పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. తమను పోలీసులు వెంబడిస్తున్నారని గ్రహించిన సుపారీ గ్యాంగ్ శ్రీనును, మహిళ ను గుంజేడు అడవిలోకి తీసుకెళ్లి దండలు మార్పించి ఫొటోలు తీశారు. ఆ తర్వాత కొంత ఆస్తిని రాసివ్వాలన్నారు. పెద్ద మనుషుల వద్ద మాట్లాడుకుందామని అతడు చెప్పడంతో నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురుగా మహిళ ఇంట్లో అతడిని వదిలేసి పరారయ్యారు.అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం శ్రీనును పోలీసులు విచారిస్తున్నారు. ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.