కాకతీయ రాజులు (Kakatiya Kings) ఓరుగల్లు కేంద్రంగా రాజ్యపాలన సాగించిన ప్రజల మెరుగైన జీవనం కోసం తెచ్చిన పథకాలు, చేపట్టిన నిర్మాణాలు దేశ వ్యాప్తంగా ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి గాంచినవే. కాగా, తమ పూర్వీకులు పాలించిన ప్రాంతాన్ని 700 ఏళ్ల తరువాత కాకతీయ వంశానికి చెందిన 22వ మహారాజు కమల్‌చంద్ర బంజ్‌దేవ్ (Kamalchandra Banjdev) దర్శించుకున్నారు. నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ మొట్టమొదటి సారిగా ఖిలావరంగల్‌కు రానున్న నేపథ్యంలో మట్టికోట వద్ద తాత్కాలిక కీర్తితోరణంతోపాటు ముఖ్య అతిథులకు స్వాగతం పలికేందుకు వేదికను నిర్మించారు.
ఖిలా వరంగల్ (Warangal) ప్రధాన ద్వారం మట్టికోట నుంచి ముందుగా సైనికులు గుర్రాలపై వెళ్తుండగా.. కమల్‌చంద్ర గుర్రపు బగ్గీపై కూర్చొని పడమర కోట నుంచి మధ్యకోట మీదుగా ఖుష్‌మహల్, శృంగారపు బావి,శి ల్పాల ఆవరణలోని కీర్తి తోరణాలు, ఏకశిలగుట్టలోని శిల్పసంపదలను తిలకించనున్నారు. ఇందులో భాగంగా బంజ్‌దేవ్ గురువారం ఉదయం వరంగల్‌కు విచ్చేసి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. తమ వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందని భంజ్‌దేవ్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. కాగా, ఆయనను తెలంగాణ మంత్రులు వరంగల్‌లో ఘన స్వాగతం పలికారు. తనను ఆహ్వానించిన నాయకులకు కమల్ చంద్ర భంజ్‌దేవ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు (Worships) చేశారు.
మాటల్లో చెప్పలేని ఆనందం..
ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. కాకతీయ వంశ వారసునిగా ఓరుగల్లును సందర్శించే అవకాశం రానుండటం చూస్తుంటే తిరిగి నా తల్లి చెంతకు చేరుకున్నట్లు అనిపిస్తోందని అన్నారు. మాటల్లో చెప్పలేని ఆనందంతో మనస్సు నిండిపోయిందని ఆయన సంతోషం వ్య క్తం చేశారు. వరంగల్ ప్రజలతో వీడదీయరాని ఆత్మీయ సంబంధం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు కమల్. వరంగల్ గురించి, కాకతీయ వైభవం గురించి నాకు ఎప్పటి నుంచో అవగాహన ఉందని తెలిపారు. ఉన్నతవిద్య కోసం లండన్ వెళ్లానని. మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ సైన్స్, మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశానని ఆయన తెలిపారు. 2009లో తిరిగి భారత్‌కు వచ్చానని అన్నారు. ఇప్పుడు నా మూలాలను వెతుక్కుంటూ మళ్లీ ఓరుగల్లుకు వస్తున్నా అని తెలిపారు. “నాకు అన్ని రకాల ఆయుధాలు వాడటంలో ప్రావీ ణ్యముంది. గోల్ఫ్, ఆర్చరీ, పోలో ఆడతాను. ఫైరింగ్ అంటే ఇష్టం. నేను శాకాహారిని, మద్యపానం అలవాటులేదు. ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితులతో కలుస్తుంటా. అందులో సామాన్యులు ఉన్నారు.. ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులూ ఉన్నారు’’. అని అన్నారు
13 వరకు కాకతీయ ఉత్సవాలు..
ఈ నెల 13 వరకు కాకతీయ ఉత్సవాలు జరుగనున్నాయి. కాకతీయుల పాలనా వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాకతీయుల చరిత్ర, కోటలు, సామ్రాజ్య విస్తరణ, వాడిన పరికరాలతో పాటు ఇతర విశేషాలు ప్రజలకు అర్ధమయ్యేలా వివరించనున్నారు. ప్రజలను ఉత్తేజ పరిచేలా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పబ్లిక్ గార్డెన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Warangal