రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
పాఠశాలలకు వెళుతూ తన వయసు వారితో హాయిగా చిన్నపిల్లలతో ఆడుకోవాల్సిన సమయంలోఓ వ్యాధి ఈ బాలుడిని కాటేసింది.హనుమకొండ జిల్లా నరిమెట్ట మండలం భూక్యతండకు చెందిన అజ్మీర సంధ్యకి ఇద్దరు కూతుర్లు ఓ కుమారుడు ఉన్నారు. భర్త ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తూ ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. సంధ్య తన భర్త అల్లుడు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్లతో సంతోషంగా జీవితాన్ని గడుపుదాం అన్న సమయంలో ఓ చేదు వార్త వినాల్సి వచ్చింది.
వీరి కుమారుడు స్కూలుకు వచ్చిన తర్వాత ఆడుకుంటున్న సమయంలో హఠాత్తుగా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఒళ్ళు మొత్తం వాపెక్కింది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తున్న సమయంలో పరీక్షలు చేశారు. పరీక్షల్లో తెలిసిందంటే కుమారుడి మూత్రపిండాలు చెడిపోయాయి అన్న వార్త వినాల్సి వచ్చింది. ఆ వార్త విన్న వెంటనే తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బాలుడి పరిస్థితితో దేవుడా మేమేం పాపం చేశామంటూ తల్లడిల్లారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్సను మొదలుపెట్టారు. డాక్టర్లు రిపోర్టులు చూసి రెండు కిడ్నీలు చెడిపోవడంతో వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. కానీ వారి దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో డయాలసిస్చేయిస్తున్నారు. అయితే డాక్టర్లు కిడ్నీ ట్రాన్స్ఫలాంటేషన్ చేయాలన్నారు.అందుకు వీరి కుటుంబ సభ్యుల్లో ఎవరి కీడ్ని అయినా మ్యాచ్ అవుతుందేమో అని అందరి వద్ద నుండి రక్త నమూనాలు సేకరిస్తే బాలుడికి తన తల్లి కిడ్నీ సరిపోతుందని రిపోర్టులలో తేలింది.
కానీ దురదృష్టం ఏంటంటేబాలుడి తల్లి కిడ్నీ మ్యాచ్ అయింది కానీ తన తల్లికి బాడీ చెక్ అప్ చేయగా ఆమెకు గుండెకు సంబంధించినవ్యాధి ఉందని తేలింది. దాంతో ఓకే ఇంట్లో భార్యకి, కుమారుడికి ఇద్దరికీ పెద్ద వ్యాధి రావడంతో ఏం చేయాలో అర్థంకాని దీనస్థితిలో భర్త కుమిలిపోతున్నాడు.
అప్పటివరకు వారి వద్ద ఉన్న భూమి, బంగారాన్ని మొత్తం అమ్మేసి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో వరంగల్ కు చేరుకొని ప్రస్తుతానికి ఎంజీఎం ఆసుపత్రిలో డయాలసిస్ చేయిస్తూ వారి కుమారుడినికాపాడుకుంటున్నారు. అయితే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తన కుమారుడి చికిత్స నిమిత్తం ఆదుకుంటే ప్రాణాన్ని కాపాడుకోవచ్చని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal