హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: మరణంలోనూ వీడని బంధం.. భార్యకు తోడుగా భర్త

Warangal: మరణంలోనూ వీడని బంధం.. భార్యకు తోడుగా భర్త

ఒకేసారి షాకింగ్ ఘటన

ఒకేసారి షాకింగ్ ఘటన

Telangana: భార్య భర్తల అనుబంధానికి నిదర్శనం ఈ కథ. మూడు ముళ్ళు, ఏడు అడుగులు వేసి కష్ట సుఖాల్లో తోడుంటానని ఇచ్చిన మాట నిజం చేశాడు ఓ వృద్ధుడు.60 సంవత్సరాలు అన్యోన్య సంసార జీవితం గడిపారు. కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : సంతోష్

లొకేషన్ : వరంగల్

భార్య భర్తల అనుబంధానికి నిదర్శనం ఈ కథ. మూడు ముళ్ళు, ఏడు అడుగులు వేసి కష్ట సుఖాల్లో తోడుంటానని ఇచ్చిన మాట నిజం చేశాడు ఓ వృద్ధుడు.60 సంవత్సరాలు అన్యోన్య సంసార జీవితం గడిపారు. కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో ఆమె మృతి తట్టుకోలేని భర్త కొన్ని గంటల వ్యవధిలోనే మరణించిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో చోటు చేసుకుంది.

ఇరుగుర్తి గ్రామానికి చెందిన ఇందుల కొమరమ్మ, కొమ్మల్ రెడ్డి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొమ్మల్ రెడ్డి ఏడాదిగా అనారోగ్యంతో మంచం పట్టాడు. అప్పటినుంచి కొమరమ్మ భర్తకు ఏ లోటు లేకుండాచంటి పిల్లాడిని చూసుకున్నట్టు సేవలు అందించింది. వారం రోజుల కిందట ఆమె పక్షవాతానికిగురై మృతి చెందింది.

విషయం తెలుసుకున్న బంధువులంతా ఇనుగుర్తి చేరుకుని ఆమె అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. పాడె పేర్చి మృతదేహాన్ని తరలించేందుకు సిద్ధమవుతుండగా మంచంలోనే ఉండి ఇదంతా గమనిస్తున్న కొమ్మల్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. భార్య తనకు చేసిన సేవలను తలచుకోవడంతో ఆయన ఆవేదన రెట్టింపు అయింది. ఆ దుఃఖాన్ని భరించలేక అతను కూడా కొద్దిసేపటికే మరణించాడు. అది గమనించిన బంధువులు కొమ్మల్ రెడ్డి అంతక్రియలకు కూడా ఏర్పాటుచేసి సాయంత్రం ఇద్దరిని ఒకేసారి అంతక్రియలు నిర్వహించారు. కొమ్మల్ రెడ్డి కొమరమ్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు బంధువులు, గ్రామస్తులు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు