హోమ్ /వార్తలు /తెలంగాణ /

shocking: ఆస్పత్రుల్లో చేరిన 33 మంది విద్యార్థులు.. ఉలిక్కిపడ్డ వరంగల్​ గడ్డ.. అసలేం జరిగింది?

shocking: ఆస్పత్రుల్లో చేరిన 33 మంది విద్యార్థులు.. ఉలిక్కిపడ్డ వరంగల్​ గడ్డ.. అసలేం జరిగింది?

వరంగల్​లో ఫుడ్​ పాయిజన్​

వరంగల్​లో ఫుడ్​ పాయిజన్​

హాస్టల్లోని సిబ్బంది పిల్లలకు భోజనం పెట్టారు. చిన్నారులందరు ఆవురావురమంటూ భోజనం చేస్తున్నారు. తింటున్న అన్నంలో ఒక విద్యార్థికి బల్లి కనిపించింది. వెంటనే హాస్టల్ సిబ్బందికి చెప్పగా 'బల్లి కనబడితే ఏమవుతుంది ఏం కాదులే' అంటూ భోజనాన్ని పిల్లలకు వడ్డించారు

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu, News18, Mulugu)

  వారందరూ తల్లిదండ్రులను విడిచిపెట్టి హాస్టల్లో  (Hostel) ఉంటూ చదువుకుంటున్న చిన్నారులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో సరదాగా గడిపారు. సాయంత్రం అవ్వగానే వసతి గృహాలకు చేరుకొని రోజులాగే రాత్రి భోజనానికి (Dinner) వెళ్లారు. హాస్టల్లోని సిబ్బంది పిల్లలకు భోజనం పెట్టారు. చిన్నారులందరు ఆవురావురమంటూ భోజనం చేస్తున్నారు. తింటున్న అన్నంలో ఒక విద్యార్థికి (Student) అనుకోకుండా బల్లి (lizard) కనిపించింది. వెంటనే ఆ విద్యార్థి హాస్టల్ సిబ్బందికి చెప్పగా 'బల్లి కనబడితే ఏమవుతుంది, ఏం కాదులే' అంటూ భోజనాన్ని పిల్లలకు వడ్డించారు. అన్నం తిన్న అనంతరం పిల్లల్లో తీవ్రమైన కడుపునొప్పి (Stomach pain), భరించలేనంత బాధతో విద్యార్థినిలు అరుపులు పెట్టారు. 33 మంది విద్యార్థినులు అస్వస్థతకు (Food Poison) గురయ్యారు.

  వెంటనే విద్యార్థులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఒకేసారి 33 మంది విద్యార్థులు అస్వస్థకు గురికావడంతో ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హుటాహుటిన స్థానిక నేతలు, అధికారులతో పాటు విద్యార్థినిల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. వసతి గృహాలల్లో ఉండే విద్యార్థినిలకు (Students) నాణ్యమైన భోజనం కలగానే మిగిలిపోతుంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎంతమంది స్పెషల్ ఆఫీసర్లను నియమించినా ఏదో ఒకచోట కలుషితమైన భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు (Food Poison) గురయ్యే సంఘటన రోజు మనం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఏటూర్ నాగారం ఐటీడీఏ స్పెషల్ ఆఫీసర్ అంకిత్ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ప్రత్యేక అధికారుల సైతం నియమించారు. ప్రత్యేక అధికారులను నియమించిన అనంతరం కూడా బల్లి పడిన భోజనం తిని విద్యార్థులు అస్వస్థకు గురయ్యారంటే పిల్లల పట్ల సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్ధం అవుతుంది.

  ఈ ఘటనపై వరంగల్ కలెక్టర్ గోపి వెంటనే స్పందించి ఘటనకు కారణమైన హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయమై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavati rathod) అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ పీవో అంకిత్ ఆసుపత్రికి చేరుకొని చిన్నారులను పరామర్శించడంతో పాటు హాస్టల్‌ని కూడా సందర్శించారు. ప్రస్తుతం విద్యార్థినిల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ నుంచి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నారు.

  Rajanna Sircilla: పింఛన్​ రావడం లేదని గ్రామపంచాయతీకి వెళ్లిన వృద్ధుడు.. అందరూ ఒక్కసారిగా షాక్​.. 

  ఇప్పటికైనా అధికారులు వసతి గృహాలలో ఉండే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినా అవసరం ఉందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడి దయవల్ల ఎవరికి ప్రాణహాని లేకపోయింది కానీ జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కానీ ఇక్కడికి వస్తే మాత్రం కనీస సౌకర్యాలు ఉండవు. కనీసం కడుపునిండా తిందామంటే కలుషితమైన ఆహారం పెడుతున్నారు. ఇలా అయితే పిల్లల చదువు మాన్పించి ఇంటికి తీసుకెళ్తాం కానీ ఇలా ప్రాణాలను పణంగా పెట్టలేమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Food, Local News, Student, Warangal

  ఉత్తమ కథలు