ఒకప్పుడు గుండెపోటు 60 ఏళ్ల వయసు నిండిన వారిలో వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా .. నిండా పాతికేళ్లు కూడా లేని యువత కూడా కుప్పకూలుతున్నారు. పదిహేనేళ్ల లోపు వారు కూడా గుండెపోటు బారినపడుతున్నారు. అప్పటి వరకు యాక్టివ్‌గా ఉండి.. ఉన్నపళంగా హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 13 ఏళ్ల అమ్మాయి గుండెపోటుతో మరణించింది. రాత్రి నానమ్మతో కబుర్లు చెప్పిన బాలిక.. ఉదయం విగత జీవిగా మారిపోయింది.
Vande Bharat: సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలు.. తొలి రోజు ఈ 10 స్టేషన్లలో ఆగుతుంది
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మడలం అబ్బాయిపాలెం శివారు బోడతండాకు చెందిన బోడ లక్పతి, వసంత దంపతుల ఓ కూతురు ఉంది. ఆమె పేరు స్రవంతి. వయసు 13 ఏళ్లు. స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో స్రవంతి ఆరో తరగతి చదువుతోంది. గురువారం రోజు శ్రీరామనవమి సందర్భంగా స్కూల్‌కు సెలవు కావడంతో తండాలోని తోటి మిత్రులతో కలిసి ఆడుకుంది. ఎప్పటిలానే ఆ రోజు కూడా చాలా యాక్టివ్‌గా కనిపించింది. రాత్రి అమ్మతో కలిసి భోజనం చేసింది. ఆ తర్వాత నానమ్మ వద్దకు వెళ్లి.. కథలు చెప్పించుకుంది. అనంతరం మెల్లగా నిద్రలోకి జారుకుంది.
ఐతే శుక్రవారం తెల్లవారుజామున ఉన్నపళంగా ఆయాసపడింది స్రవంతి. తనకు ఏదో అవుతోందని భయపడుతూ.. నానమ్మని నిద్రలేపింది. చాలా ఆయాసపడుతూనే నిద్రలేచి కూర్చుంది. ఆ తర్వాత మంచంపైనే ఒరిగిపోయింది. ఎంత పిలిచినా పలకలేదు. తల్లిదండ్రులు హుటాహుటిన స్రవంతిని.. తీసుకొని స్థానికంగా ఉన్న డాక్టర్ వద్దకు తెలుసుకున్నారు. ఆమెకు పరీక్షలు చేసిన డాక్టర్.. అప్పటికే పల్స్ ఆగిపోయినట్లు చెప్పాడు. బాలిక గుండె పోటుతో మరణించిందని చెప్పడంతో... తల్లిదండ్రులు షాక్‌లోకి వెళ్లారు. రాత్రి ఎంతో చలాకీగా కనిపించిన తమ కూతురు.. ఉదయం విగత జీవిగా మారిపోవడంతో..వారు గుండెలవిసేలా రోదించారు. స్రవంతి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heart Attack, Local News, Mahabubabad