హోమ్ /వార్తలు /తెలంగాణ /

టీవీ రీచార్జి చేయలేదని 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య.. తల్లిదండ్రులూ జర జాగ్రత్త.. !

టీవీ రీచార్జి చేయలేదని 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య.. తల్లిదండ్రులూ జర జాగ్రత్త.. !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాను ఎంత చెప్పిన రీచార్జి చేయడం లేదని.. ఆ బాలుడు మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఇంటి పైకప్పునకు చీరతో ఉరివేసుకున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhupalpalle, India

ఈ కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. స్కూల్ ముగిసిన వెంటనే ఇంటికి వచ్చి.. ఫోన్‌తో ఆడుకోవడం.. టీవీల్లో వీడియోలు చూడడం వంటివి చేస్తున్నారు. మరికొందరైతే వాడికి అడిక్ట్ అయిపోతున్నారు. కాసేపు కూడా వాటిని చూడకుండా ఉండలేకపోతున్నారు. ఫోన్ లాక్కున్నా.. టీవీ రిమోట్ తీసుకున్నా... భరించలేకపోతున్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ బాలుడు కూడా ఇలాగే.. టీవీకి, మొబైల్ ఫోన్‌కి బానిస అయ్యి.. చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.

టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం..

కాటారం మండలానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ మహిళ స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ.. పిల్లలను పోషిస్తోంది. ఆమె పెద్ద కుమారుడు ఆరో తరగతి చదువుతున్నాడు. ఆ పిల్లాడు స్కూల్ ముగిసిన తర్వాత.. మొబైల్ ఫోన్, టీవీతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఐతే వారి టీవీ, మొబైల్ ఫోన్‌లో రీచార్జి అయిపోవడంతో.. రీచార్జి చేయించమని తల్లిని కోరాడు. కానీ ఆమె మాత్రం ఆర్థిక సమస్యల వల్ల.. ఏదో ఒక కారణం చెప్పి.. రోజులు గడుపుతూ వస్తోంది. బుధవారం మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఆ పిల్లాడు.. రీచార్జి గురించి మరోసారి తల్లిని అడిగాడు. ఐతే టీవీ తీగలను ఎలుకలు కొరికాయని.. వాటిని చేయించి తర్వాత టీవీతో పాటు మొబైల్ ఫోన్‌ను రీచార్జి చేయిస్తానని చెప్పింది. ఆ తర్వాత ఎడ్లకు మేత వేసేందుకు వెళ్లింది.

తాను ఎంత చెప్పిన రీచార్జి చేయడం లేదని.. ఆ బాలుడు మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఇంటి పైకప్పునకు చీరతో ఉరివేసుకున్నాడు. స్థానికులు గమనించి.. హుటాహుటిన అతడి తల్లికి సమాచారం అందించారు. అనంతరం బాలుడిని మహాదేవపూర్‌‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు.. అప్పటికే అతడు మరణించినట్లు చెప్పారు. బాలుడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి, కుటుంబసభ్యులు గుండెలు అవిసేలా రోదించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు.. పోలీసులు వెల్లడించారు.

First published:

Tags: Bhupalapally, Local News, Suicide, Warangal

ఉత్తమ కథలు