హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఈ పాప కాలు కదిపితే రికార్డుల మోతే.. జానపదానికి కేరాఫ్ అడ్రస్

ఈ పాప కాలు కదిపితే రికార్డుల మోతే.. జానపదానికి కేరాఫ్ అడ్రస్

X
Dance

Dance award

Wonder Girl: పిల్లలపై తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకుంటారు. పెద్దయ్యాక ఇంజనీర్ కావాలని, డాక్టర్ అవుతారని కలలు కంటూ ఉంటారు. అంబాడటం కూడా సరిగ్గా రాని చిన్నారులు అన్నప్రాసనం రోజున ఏం పట్టుకుంటారా అని ఎదురుచూస్తూ ఆత్రంగా ఉంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

పిల్లలపై తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకుంటారు. పెద్దయ్యాక ఇంజనీర్ కావాలని, డాక్టర్ అవుతారని కలలు కంటూ ఉంటారు. అంబాడటం కూడా సరిగ్గా రాని చిన్నారులు అన్నప్రాసనం రోజున ఏం పట్టుకుంటారా అని ఎదురుచూస్తూ ఆత్రంగా ఉంటారు. వారు పెద్దయ్యాక ఏం కావాలో అని తల్లిదండ్రులు ఊహించేసుకుంటారు. అయితే కొంతమంది పిల్లలు కాలు కదిపితే చిచ్చరపిడుగులే. కొందరేమో జానపదాలతో చిందేస్తే మరికొందరు సందేశాత్మక తరాలలోని పాటలతో నృత్యాలు చేస్తారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రదర్శనతో పురస్కారాలు కూడా అందుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల చిన్నారులు ఇతర రాష్ట్రాల్లో నృత్యాలు చేసి మరి జాతీయస్థాయిలో అవార్డులు పొందుతున్నారు. ప్రతిభను చాటడంలో బాలికలు ఎందులోనూ తీసుకోరని చాటి చెబుతున్నారు. వీరిని స్ఫూర్తిగా మిగతా పిల్లలు తమలోని కలలను వెలికి తీసి సత్తాను చాటాలి.

వరంగల్ కేంద్రంలోని కరీమాబాద్ కు చెందిన నక్షత్ర జానపద నృత్యంలో చిందేస్తూ నిజంగా నక్షత్రమే అన్నట్లుగా మైమరిపిస్తోంది. ఆటో డ్రైవర్ గా జీవితం కొనసాగిస్తున్న తన తండ్రి సంపత్, తల్లి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వీరి కుటుంబాన్ని జీవనం సాగిస్తోంది. కరీమాబాదులోని కివి పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న నక్షత్ర పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో జానపద నృత్యంలో రాణిస్తుంది.

ఇది చదవండి: నమ్మకానికి సైన్స్ కి తేడా ఇదే..! ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం..!

ప్రతి ఏటా రుసుగుట్ట మైదానంలో జరిగే దసరా నరకాసుర వధ బతుకమ్మ ఉత్సవాలతో పాటు ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ ఉత్సవాల్లోనూ జానపదాలతో సోలోగా ప్రదర్శన ఇస్తుంది. గతంలో బుల్లెట్ బండి నృత్యానికి వేలాది మంది ప్రజలు తన ప్రదర్శనను చూసి చిందేశారు. మహారాష్ట్రలోని లాతూర్ లో నిర్వహించిన జాతీయ స్థాయి జానపద పోటీల్లో సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చి మొదటి స్థానంలో నిలిచి బహుమతులను అందుకుంది.

ఇది చదవండి: ఈ స్కూల్‌కి మంత్రివర్గం.. పిల్లలే మంత్రులు..! ఎక్కడుందంటే..!

నక్షత్ర అంటే నిజంగానే ఆ పాఠశాలలో నక్షత్రంగా మెరిసిపోయిందని.. ఎల్కేజీ చదువుతున్నప్పటి నుండి చిన్నారికి నృత్యాలు చేయడంలో చాలా ఆసక్తి ఉండేదని ప్రతిభను చూసి ఎలాగైనా ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయిలో ఉంటుందన్న ఉద్దేశంతో తనే స్వయంగా డాన్స్ మాస్టర్ రవితేజ వద్ద ట్రైనింగ్ నేర్పించామని తమ విద్యార్థి జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని పాఠశాల డైరెక్టర్ సతీష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

తనకు చిన్నతనం నుండే డాన్స్ పై చాలా ఆసక్తికరంగా ఉండేదని, తన ఉపాధ్యాయుడు సతీష్ ప్రోత్సాహంతో తాను ముందుకు సాగుతూ ఇలాంటి జాతీయస్థాయి అవార్డులు పొందానని, తన నాన్నగారు సంపత్ ఆటోడ్రైవర్ గా పని చేస్తూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని ఇంతటి పేదరికంలో కూడా తనను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న తన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు రవితేజకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది అవార్డు గ్రహీత నక్షత్ర.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు