సయ్యద్ రఫీ, న్యూస్, 18, మహబూబ్ నగర్
కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. మనం తరచుగా ప్రభుత్వ శాఖలో ఉద్యోగులు సమయాన్ని అసలు పాటించరు. ఇష్టమోచ్చినట్లు వచ్చి, గంటల తరబడి బయట పిచ్చాపాటిగా టైంపాస్ చేస్తుంటారు. ఇలాంటి సందర్బాలలో అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు వీరి బండారం బయటపడుతుంది. ఇలాంటి ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ విజిట్ చేశారు. ఈ క్రమంలో.. ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న రాములును సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా 8 లక్షల విలువ గల పనులను పరిశీలించేందుకు కొత్తకోట మండల కేంద్రంలోని మసీదు దగ్గర ఉన్న ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆ సమయంలో ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో లేకపోవడం, ఎలాంటి సెలవు కానీ, ఉన్నతాధికారులకు సమాచారం కానీ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ అతన్ని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకపోవడం, సెలవు పెట్టకపోవడం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడం క్షమించ రానిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్ పాఠశాలలను సందర్శించింది విద్యాశాఖ ఉన్నతాధికారులకు కూడా తెలుపకుండా ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ప్రధానోపాధ్యాయిని విషయం బయటపడింది. అనంతరం పాఠశాలల్లో నడుస్తున్న పనులను, వాటి నాణ్యతను పరిశీలించారు. కలెక్టర్ వెంట కొత్తకోట తహసీల్దార్ బాల్ రెడ్డి, కమిషనర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mahabubnagar, Telangana