వీధులనే పాఠశాల గదులుగా ,పాత గోడల్ని నల్లని బోర్డుగా చేసి పిల్లలకు విద్యాబోధన చేస్తుంది ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, పెద్దపల్లి జిల్లా పుట్టపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. కరోనా కాలంలో పిల్లల బడులకు దూరం అయ్యారు. ఇక, ప్రభుత్వ పాఠశాలల్లొ చదివే పిల్లల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి తరుణంలోనే భాగ్యలక్ష్మి.. చాలా వినూత్నంగా ఆలోచించారు. పిల్లలు చదువులకు దూరం కావద్దనే ఉద్దేశంతో చాలా మంచి ఆలోచనతో ముందుకు కదిలారు. గ్రామంలో పిల్లలు ఆడుకునే, పాడుకునే ప్రదేశాల్లో.. వారు ఎంతో కొంత చదువుకునేలా చేశారు. ఊరు మొత్తం గోడలపైన వాల్ పెయింటింగ్ వేసి పిల్లలను చదువుకునేలా చేశారు.
దీంతో పిల్లలు ఓ వైపు ఆడుతూ, పాడుతూనే గోడలపై రాసిన వాటిని చూస్తూ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉన్న భాగ్యలక్ష్మి.. పిల్లల భవిష్యతును దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ పనిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగమే కదా.. జీతం వస్తుంది ఇంకేం పని ఉందిలే అనుకోకుండా.. పిల్లలు గురించి ఆలోచించడం చాలా గొప్ప విషయమని అంటున్నారు. ఈ క్రమంలోనే పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మా పిల్లల్ని తన పిల్లలగా చూసుకుంటూ పిల్లలకు ఎలాగైనా చదువుకునేల చేయాలని టీచర్ ఇలాంటి ప్రయత్నం చేయడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. ఇప్పుడు పిల్లలు అందరూ చాలా బాగా చదువుకోవడం మొదలు పెట్టారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
కాగా ఇలాంటీ ప్రయోగాలు రాష్ట్రంలో అక్కడక్కడ ఉపాధ్యాయులు చేస్తున్నారు..అయినా గ్రామీణ పిల్లల్లో చదువు అంతమాత్రమే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కరోనా తగ్గతుండటంతో సెప్టెంబర్ 1 నుండ స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Telangana News