హోమ్ /వార్తలు /తెలంగాణ /

Osmania university : ఈ యూనివర్శిటిలో ఇక నో ఫ్రీ వాకింగ్.. యూజర్ చార్జీలు వసూలు..

Osmania university : ఈ యూనివర్శిటిలో ఇక నో ఫ్రీ వాకింగ్.. యూజర్ చార్జీలు వసూలు..

osmania

osmania

Osmania university : ఉస్మానియా యూనివర్శిటిలో ఇక నుండి ఫ్రీ వాకింగ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు అధికారులు.. డిశంబర్ ఒకటి నుండి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు.

  నగరంలో జాగింగ్,వాకింగ్ చేయాలంటే సరైన సదుపాయాలు, పబ్లిక్ పార్కులు లేని పరిస్థితి ఉంటుంది. దీంతో అందుబాటులో ఉన్న యూనివర్శీలు, ప్రభుత్వ స్థాలాలానే వాకర్స్ ఉపయోగించుకుంటున్నారు. ఈక్రమంలోనే ప్రతీష్టాత్మక ఉస్మానియా యూనివర్శిటిలో కూడా చుట్టుపక్కల నివాసితులు వేలాది మంది మార్నింగ్,ఈవినింగ్ వాకింగ్ చేస్తుంటారు. అయితే వారికి ఉస్మానియా యూనివర్శిటి షాక్ ఇచ్చింది. (Walkers should pay user charges ) వచ్చే నెల నుండి యూనివర్శిటి గ్రౌండ్‌లో వాకింగ్ చేసే వారి నుండి 200 రూపాయల యూజర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు.

  ముఖ్యంగా తార్నాక, డిడి కాలనీ, విద్యా నగర్, మాణికేశ్వర్ నగర్, అడిక్‌మెట్, హబ్సిగూడ మరియు అంబర్‌పేట్‌తో సహా విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల నుండి అనేక వందల మంది ప్రజలకు, క్యాంపస్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ మరియు యోగా వంటి ఫిట్‌నెస్ కార్యకలాపాలకు వస్తుంటారు..

  Revanth reddy : ధాన్యం కొనుగోలు చేయకపోతే... మోదీ, కేసీఆర్‌లకు నడిబజార్‌లో ఉరి ఖాయం..!


  కాగా గతంలో కూడా యూజర్ చార్జీలపై కార్యచరణకు ముందుకు వచ్చినా... వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాలనా యంత్రాంగం నిలుపుదల చేయాల్సి వచ్చింది. (Walkers should pay user charges ) అయితే తాజాగా మరోసారి కరోనా ప్రభావం ,తో సరైన సౌకర్యాలు కల్పించడంతోపాటు క్యాంపస్‌లో తమకు మెరుగైన సౌకర్యాల కల్పించడం వల్ల వాకర్సే ఇప్పుడు యూజర్ చార్జీలు వసూలు చేయాలని సూచించినట్టు ఓయూ అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే కొంతమంది అధిక డబ్బులు కూడా చెల్లించేందుకు కూడా ముందుకు వచ్చారని, కాని అందరిని దృష్టిలో పెట్టుకుని నెలకు రూ.200 మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించామని.(Walkers should pay user charges ) క్యాంపస్‌లో నడిచే వారి కోసం వాకింగ్ ట్రాక్‌లు, బయో టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

  Gangula kamalaker : పంట మార్చిన మంత్రి గంగుల.. ప్రత్యామ్నాయ పంటలపై రాష్ట్రం దృష్టి..


  క్యాంపస్ ‌లో ఉన్న జీమ్‌కు కూడా ఇప్పటికే ఒక్కొక్కరికి 1000 రూపాయలను వసూలు చేస్తున్నారు. (Walkers should pay user charges ) కాగా ప్రత్యేకంగా వారి కోసం ఉదయం 6 నుండి 9 గంటల వరకు మరియు సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఒకటిన్నర గంటల వ్యవధిలో రెండు స్లాట్‌లలో అందుబాటులో ఉంటుంది మరోవైపు,బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్ గ్రౌండ్ తో పాటు ఇతర ఆట స్థలాల వినియోగానికి కూడా రూ. 500 చెల్లించి వాడుకోవచ్చని అధికారులు తెలిపారు.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Hyderabad, Osmania University

  ఉత్తమ కథలు