Home /News /telangana /

VROS ASSOCIATION REACTION ON TELANGANA NEW REVENUE ACT SK

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు.. మరి వీఆర్వోలు ఏమంటున్నారు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రజల కోసం ఎంతో సేవచేస్తూ.. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నామని అన్నారు. తమ కష్టాన్ని గుర్తించకుండా ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారని... ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో వీఆర్‌వోల ప్రస్థానం ముగిసింది. రాష్ట్రంలో వీఆర్వోల వ్యవస్థను రద్దుచేస్తూ కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వారి నుంచి అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థాయిలో అవినీతికి వీఆర్వోలు కేంద్ర బిందువుగా ఉన్నారని.. ఏళ్ల తరబడి వాళ్ల చుట్టూ తిరిగినా ఇప్పటికీ పాస్ బుక్‌లు అందలేదని వాపోయారు. వీఆర్వోల ధన దాహం, నిర్లక్ష్యం వల్ల.. తాము రైతు బంధు పథకానికి దూరమయ్యామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అలాంటి లంచగొడి వ్యవస్థను రద్దు చేయడం సంతోషంగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై వీఆర్వోలు స్పందిస్తున్నారు.

    మంగళవారం మీడియతో మాట్లాడిన వీఆర్వోల సంఘం ప్రెసిడెంట్ గోల్కొండ సతీష్.. కొత్త చట్టాన్ని తాము స్వాగతిస్తామని అన్నారు. ఐతే కొత్త చట్టంలో వీఆర్వోల పాత్ర ఎలా ఉంటుందో తెలియదనీ, తమ పాత్రపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం ఎంతో సేవచేస్తూ.. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నామని అన్నారు. తమ కష్టాన్ని గుర్తించకుండా ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారని... ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. అందరిపైనా నిందలువేసి ఇతర శాఖలకు పంపవద్దని ప్రభుత్వాని కోరారు.

    కాగా, వీఆర్వోల వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్... ఇప్పటికే వీఆర్వోల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకుంది. కొత్తచట్టానికి ముందు అక్రమ లావాదేవీలు జరిగే అవకాశముండడంతో వారి వద్ద నుంచి అన్ని రకాల రికార్డులను తీసుకున్నారు. మరోవైపు మంగళవారం రాత్రి 07.30కి ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోద ముద్రవేయనున్నారు. అనంతరం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి.. కొత్త చట్టాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Revenue officers, Telangana, Telangana revenue

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు