న్యూస్18 తెలుగు ప్రతినిధిః పి మహేందర్,
ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు... ఈ సంఘటన బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారనే విషయం తెలియడంతో.... ఇసుక రవాణాను అడ్డుకునేందుకు స్థానిక వీఆర్ఏ గౌతమ్ ప్రయత్నించారు.. ( VRA death attacked by sand mafia ) దీంతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా ముఠా వీఆర్ఏను అక్కడే చితకబాదారు.. అనంతరం ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీఆర్ఏ గౌతమ్‌ను ప్రభుత్వ ఆసుస్పత్రికి తరలించ్చారు..కాగా చికిత్స పొందుతూ గౌతమ్ మంగళవారం మృతి చెందాడు.
సంఘటనతో షాక్ తిన్న జిల్లాకు చెందిన వీఆర్ఏ సంఘ నాయకులతో పాటు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఇసుక మాఫియా దారులు వీఆర్ఏ ప్రాణం తీశారని సంఘం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు...( VRA death attacked by sand mafia ) ఈ సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు...మరోవైపు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందని .. అదే జరిగితే.. ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.. ఇదంతా ఇసుక మాఫియా చేస్తున్న కుట్రగా వారు అభివర్ణించారు..( VRA death attacked by sand mafia ) కాగా మృతి చెందిన వీఆర్ఏ గౌతం( 37) అనుమానాస్పదంగా మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక బోధన్ ఎస్సై లోకం సందీప్ తెలిపారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad, Sand mafia