Home /News /telangana /

VOTERS FEEL UNCOMFORTABLE IN SOME CENTRES DURING TELANGANA MLC ELECTIONS DUE TO SEVERAL REASONS AK

Telangana MLC Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు.. కారణం ఇదే..

ఓటు వేసేందుకు వేచి ఉన్న ఓటర్లు

ఓటు వేసేందుకు వేచి ఉన్న ఓటర్లు

Telangana MLC Elections: ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు భిన్నమైనవి కావడంతో.. ఓటర్లు ఓటు వేసేందుకు ఎక్కువ సమయం పడుతోంది.

    తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గతానికి భిన్నంగా ఈసారి పట్టభద్రులైన ఓటర్లు పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరుగుతున్న ఎన్నికలను రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. ఓట్ల శాతం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఓట్లు వేసేందుకు వస్తున్న ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాల దగ్గర ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు భిన్నమైనవి కావడంతో.. ఓటర్లు ఓటు వేసేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఒక్కో ఓటరు ఓటు వేయడానికి పదిహేను నిమిషాలకుపైగా సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. కరోనా నిబంధనలు పాటించడం కూడా ఇందుకు మరో కారణం. దీంతో క్యూలైన్లలో ఓటర్లు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

    ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎండ తీవ్రత కూడా కొన్ని చోట్ల ఓటర్లను ఇబ్బంది పెడుతోంది. పలు పోలింగ్ కేంద్రాల దగ్గర కనీసం వసతులు కూడా కల్పించకపోవడంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే పోలింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు.

    మహబుబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో 5,31,268 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,36,256 మంది పురుషులు, 1,94,944 మంది స్రీలు, 68 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా మేడ్చల్‌-మల్కాజిగిరిలో 1,31,284 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా నారాయణపేట్‌ జిల్లాలో 13,899 మంది మాత్రమే ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 35,510 మంది ఓటర్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 33,924, వన పర్తి జిల్లాలో 21,158, జోగులాంబ-గద్వాల్‌లో 14,876, నారాయణ్‌పేట్‌లో 13,899, రంగారెడ్డి జిల్లాలో 1,44,416, వికారాబాద్‌లో 25,958, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 1,31,284, హైదరాబాద్‌ జిల్లాలో 1,10,243 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో 799 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 56, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 44, వనపర్తి జిల్లాలో 31 , జోగులాంబ-గద్వాల్‌లో 22, నారాయణ్‌పేట్‌లో 20, రంగారెడ్డి జిల్లాలో 199, వికారాబాద్‌లో 38, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 198, హైదరాబాద్‌ జిల్లాలో 191 ఉన్నాయి.

    ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 71 మంది ఉన్నారు. అక్కడ 505565 మంది ఓటర్లు ఉండగా 731 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Telangana, Telangana mlc election, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు