హోమ్ /వార్తలు /తెలంగాణ /

Vote For Note Case: ఓటుకు నోటు కేసు.. తెలంగాణ ఏసీబీకి సుప్రీం కోర్టు నోటీసులు

Vote For Note Case: ఓటుకు నోటు కేసు.. తెలంగాణ ఏసీబీకి సుప్రీం కోర్టు నోటీసులు

5. చనిపోయిన హిందూ పురుష వ్య‌క్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీం తెలిపింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

5. చనిపోయిన హిందూ పురుష వ్య‌క్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీం తెలిపింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తయ్యే వరకు.. సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి.. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌పై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రేవంత్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం.. ఆ కేసు విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలిన తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

  తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

  ఇక, ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విరామం తర్వాత ఈడీ గురువారం నాంపల్లిలోని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ కు 50 లక్షల రూపాయలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ చార్జ్ షీట్ ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ.. ఈ కేసులో రేవంత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నట్టుగా తెలిసింది. మనీలాండరింగ్‌ నేరానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ చార్జ్ షీట్‌లో రేవంత్‌రెడ్డితో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, హ్యారీ సెబాస్టియన్‌, రుద్ర ఉదయ్‌సింహ, జెరూసలెం మత్తయ్య, వేం నరేందర్‌రెడ్డి కుమారుడు వేం కృష్ణకీర్తన్‌ పేర్లను ఈడీ అధికారులు పేర్కొన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Revanth Reddy, Supreme Court, Telangana

  ఉత్తమ కథలు