మాజీ ఎంపీ వివేక్‌కు షాక్.. హెచ్‌సీఏ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ

HCA Elections : సుప్రీం కోర్టులో వివేక్‌కు సంబంధించి 'కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్' కేసు ఒకటి పెండింగ్‌లో ఉండటం.. దానిపై ఇంకా తుది తీర్పు రాకపోవడంతో.. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీకి రిటర్నింగ్ అధికారి ఆయన్ను అనర్హుడిగా ప్రకటించారు.

news18-telugu
Updated: September 22, 2019, 5:22 PM IST
మాజీ ఎంపీ వివేక్‌కు షాక్.. హెచ్‌సీఏ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ
వివేక్ వెంకటస్వామి (File)
news18-telugu
Updated: September 22, 2019, 5:22 PM IST
హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల రేసులో నిలవాలని భావించిన మాజీ ఎంపీ వివేక్‌కు చుక్కెదురైంది. ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. సుప్రీం కోర్టులో వివేక్‌కు సంబంధించి 'కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్' కేసు ఒకటి పెండింగ్‌లో ఉండటం.. దానిపై ఇంకా తుది తీర్పు రాకపోవడంతో.. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీకి రిటర్నింగ్ అధికారి ఆయన్ను అనర్హుడిగా ప్రకటించారు. రేసులో వివేక్ లేకపోవడం టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌కు కలిసిరానుంది. గురువారం ఆయన హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. 2017లోనూ ఆయన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ.. అప్పట్లో తిరస్కరణకు గురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్‌పై జీవితకాలం నిషేధం ఉండటంతో అప్పట్లో ఆయన నామినేషన్‌ను హెచ్‌సీఏ తిరస్కరించింది. అప్పటికే బీసీసీఐ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ.. దానికి సంబంధించిన పత్రాలను దాఖలు చేయలేదన్న కారణంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. కాగా, ఈ నెల 27న హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి.

First published: September 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...