సూర్యాపేట జాతీయ కబడ్డీ పోటీల్లో ప్రమాదం.. 60 మందికి గాయాలు

ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు

6 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఇనుప స్టాండ్ ఒక్కసారిగా కూలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది.

 • Share this:
  సూర్యాపేట జాతీయ కబడ్డీ పోటీల్లో అనుకోని ప్రమాదం సంభవించింది. వీక్షకుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అనేక మంది గాయపడ్డారు. సుమారు 60 మందికిపైగా గాయాలు అయినట్టు సమాచారం. ఇనుప చువ్వల్లో కాళ్లు, చేతులు ఇరుక్కుని పలువురికి తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఇతరులు వారిని పోలీసులు, రెవెన్యూ అధికారుల వాహనాల్లో ఆస్పత్రికి తరలించడం మొదలుపెట్టారు. ప్రమాద సమయంలో స్టేడియంలో1500 మంది ప్రేక్షకులు ఉన్నట్టు తెలుస్తోంది. స్టేడియంలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులను అనుమతించడంతో ప్రమాదం జరిగినట్టు సమాచారం.

  6 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఇనుప స్టాండ్ ఒక్కసారిగా కూలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. 47వ జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభమైన 6 నిమిషాలకే ప్రమాదం జరిగింది. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాద సమయంలో మంత్రి జగదీష్ రెడ్డితో పాటు అధికారులు అక్కడే ఉన్నారు. స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి.. పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షిస్తున్నారు. జాతీయ క్రీడల కోసం మూడు గ్యాలరీలు చేసినట్టు తెలుస్తోంది.

  అయితే ప్రమాదంలో గాయపడ్డ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈఘటన జరగడంతో రెయిలింగ్‌ కింద పలువురు ప్రేక్షకులు ఇరుక్కుపోయారు. స్టేడియం గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ఈఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
  Published by:Kishore Akkaladevi
  First published: